గర్ల్ ఫ్రెండ్​కి గోల్డ్ రింగ్ కొనిచ్చేందుకు మొబైల్స్ చోరీ

  • షాప్​లో అమ్ముతుండగా పట్టుకున్న పోలీసులు
  • ఆరు చైన్ స్నాచింగ్, ఫోన్ల చోరీలకు పాల్పడినట్లు గుర్తింపు

న్యూఢిల్లీ: గర్ల్ ఫ్రెండ్​కి గోల్డ్ రింగ్ కొనిచ్చేందుకు చోరీ చేసిన మొబైల్ ఫోన్లు అమ్ముతుండగా అడ్డంగా బుక్కయ్యాడో వ్యక్తి. ఆ దొంగతో పాటు మరొకరిని పోలీసులు అరెస్ట్ జేసి జైలుకు తరలించారు. కొద్ది రోజులుగా లాక్​డౌన్ కొనసాగుతున్నందున ఫోన్లు అమ్మలేకపోయాడని, ఇప్పుడు సడలింపుల్లో మొబైల్ షాపులు ఓపెన్ చేయగానే వాటన్నింటిని అమ్మగా వచ్చిన డబ్బుతో తన ప్రేయసి కోసం ఉంగరం కొనాలనుకున్నాడని పోలీసులు వివరించారు. ఢిల్లీ లోని భలాస్వ డెయిరీలో నివాసం ఉంటున్న అరుణ్​, అంకిత్ ల అరెస్టుతో నాలుగు దోపిడీ కేసులు పరిష్కారమయ్యాయని చెప్పారు. వీరినుంచి నాలుగు ఫోన్లు, బైక్​స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఢిల్లీలోని ముకార్బా చౌక్ దగ్గర్లో లారీ డ్రైవర్లు, కాలి నడకన వెళ్తున్న వారి నుంచి ఫోన్ల దోపిడీకి పాల్పడినట్లు నిందితులు వెల్లడించారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) గౌరవ్ శర్మ సోమవారం మీడియాకు తెలిపారు.
‘‘జూన్ లో తన పుట్టినరోజు నాడు బంగారు ఉంగరాన్ని గిఫ్ట్ గా ఇస్తానని అరుణ్ తన ప్రేయసికి ప్రామిస్ చేశాడు. అందుకు మొబైల్ ఫోన్ల దోపిడీకి పాల్పడ్డాడు. కానీ, లాక్​డౌన్ కారణంగా వాటిని ఎక్కడా అమ్మలేకపోయాడు. చైన్ స్నాచింగ్, మొబైల్ ఫోన్ల చోరీకి సంబంధించి ఆరు కేసుల్లో అరుణ్ నిందితుడిగా ఉన్నట్లు గుర్తించాం” అని డీసీపీ శర్మ చెప్పారు.

Latest Updates