దొంగతనం కేసు : ఒక్క రోజులోనే చేధించిన పోలీసులు

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో డిసెంబర్ 31న జరిగిన దొంగతనం కేసును 24గంటల్లో చేధించారు పోలీసులు. నగల వ్యాపారి భాస్కర్ నడిపిన డ్రామాకు ఫుల్ స్టాప్ పెట్టారు. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టాలని దురాశతో ఇంటి దొంగలే.. ఈ నాటకం ఆడారన్నారు సీపీ కమలాసన్ రెడ్డి. స్పెషల్ టీంను ఏర్పాటు చేసి 24 గంటల్లోనే కేసును ట్రేస్ ఔట్ చేశామన్నారు. తన ఇంట్లో  దొంగతనం జరిగిందని, దాదాపు 70 లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విజయలక్ష్మీ జ్యూవెలరీ షాపు యజమాని. డిసెంబర్ 31న వచ్చిన కంప్లైంట్ ను సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. దొంగతనం అంతా నాటకమని తేల్చారు. చోరీ  జరిగిందని పోలీసులను తప్పుదోవ పట్టించారన్నారు సీపీ. యజమానిపై కేసు నమోదు చేస్తామన్నారు.

Latest Updates