ఐరన్​ మ్యాన్ రెమ్యునరేషన్ ​రూ.524 కోట్లు

Robert Downey Jr paid Rs 524 crore as salary for Avengers Infinity War

రాబర్ట్​ డౌనీ జూనియర్స్​.. పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమేమోగానీ, ఐరన్​ మ్యాన్​ అంటే ఠక్కున గుర్తు పట్టేస్తారేమో కదా. అవెంజర్స్​ హీరో అన్నా మదిలో మెదుల్తది కదా. ఈ హీరో గారు అవెంజర్స్​ ఇన్ఫినిటీ వార్​ సినిమా కోసం తీసుకున్న పైసలు రూ.524 కోట్లని (7.5 కోట్ల డాలర్లు) తెలుసా? అంతేకాదు.. ఆ సిరీస్​లలో బ్యాక్​ ఎండ్​ ద్వారానూ లాభాల్లో వాటా వచ్చిందట. స్పైడర్​ మాన్​: హోం కమింగ్​ సినిమా కోసమూ అంతే భారీ మొత్తంలో పైకం తీసుకున్నాడట. మూడు రోజుల షెడ్యూల్​ కోసం రోజుకు సుమారు రూ.34.75 కోట్లు (50 లక్షల డాలర్లు) తీసుకున్నాడట. ఐరన్​ మ్యాన్​ సక్సెస్​ తర్వాత 2 కోట్ల డాలర్లు (సుమారు రూ.140 కోట్లు) వసూలు చేసిన హీరోల జాబితాలోనూ డౌనీ చేరిపోయాడు. కాగా, అతడు నటించిన అవెంజర్స్​ ఎండ్​గేమ్​ ఐదు రోజుల్లో రూ.8 వేల కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది.

Latest Updates