పడి లేచిన కెరటం: ఐరన్ మ్మాన్

అవెంజర్స్‌ శకం ముగిసింది. అంతమైన సూపర్ హీరోలు తిరిగిరావడం.. విలన్‌ థానోస్‌ అంతం కావడంతో ‘ఎండ్‌ గేమ్‌ ’ కథ సుఖాంతమైంది. అయితే టోనీ స్టార్క్‌ అలియాస్‌ ఐరన్‌ మ్యాన్‌ ప్రాణత్యాగం ప్రేక్షకుల్నిభావోద్వేగానికి లోనయ్యేలా చేసింది. హార్డ్‌ కోర్‌‌‌‌ ఫ్యాన్స్‌ ఆ సన్నివేశానికి థియేటర్లలోనే గుక్కపట్టి ఏడ్చేశారు. ఐరన్‌ మ్యాన్‌ పాత్రలో ప్రేక్షకులతో అంతలా అనుబంధాన్ని ఏర్పరుచుకున్నాడు హాలీవుడ్‌ స్టార్‌‌‌‌ రాబర్ట్‌‌‌‌ డానీ జూనియర్‌‌‌‌. అతని జీవితం యువతకు ఒక మంచిపాఠం కూడా.

హాలీవుడ్‌ లో ఒక్కచిత్రానికి అత్యధిక పారితోషకం అందుకున్న హీరోగా రాబర్ట్‌‌‌‌ డానీ పేరు మారుమోగిపోతోంది. ఆ రెమ్యునరేషన్‌ అక్షరాల 540 కోట్లుపైమాటే. అయితే డానీ గతం, వ్యక్తిగత జీవితం వివాదాలతోనే సాగాయి. డ్రగ్స్‌అలవాటు, అరెస్టులు, రిహాబిలిటేషన్ సెంటర్‌‌‌‌లో చికిత్స, కోర్టు విచారణలు, విమర్శలు, భార్యలు ఛీకొట్టి విడిచివెళ్లిపోవడం.. బహుశా ఏ యాక్టర్‌‌‌‌ వ్యక్తిగత జీవితం కూడా ఇంత అధోఃస్థితిలో ఉండదేమో!. అయితే ‘నటన’ అనే బలం డానీని తిరిగి మామూలు మనిషిని చేసింది. మధ్యవయసులో అవకాశాలు అతన్ని వెతుక్కుంటూ వచ్చాయి. వరుస సక్సెస్‌ లు స్టార్‌‌‌‌ హీరో స్టేటస్‌ నితెచ్చిపెట్టాయి.

తండ్రి–కొడుకులు కలిసే..
డానీ కుటుంబానికి సినీ నేపథ్యం ఉంది. తండ్రి రాబర్ట్‌‌‌‌ డానీ(సీనియర్) నటుడు, ఫిల్మ్‌ మేకర్‌. తల్లి ఎలిసే ఆన్‌ నటి. ఐదేళ్ల వయసులో చైల్డ్‌‌‌‌ ఆర్టిస్ట్‌‌‌‌గా తండ్రి సినిమాలతో డానీ కెరీర్‌ప్రారంభించాడు. హైస్కూల్‌‌‌‌ చదువు పూర్తయ్యాక.. చదువుకు గుడ్‌ బై చెప్పి నటనలో శిక్షణతీసుకోవడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో కెనడియన్‌ స్టార్‌ హీరో కైఫర్‌ సదర్‌ ల్యాండ్‌ , డానీఇద్దరూ రూమ్‌ మేట్స్‌.

నటనతో పాటే డ్రగ్స్‌ అలవాటు పెరిగిపోయింది. డానీకి డ్రగ్స్‌ అలవాటుచేసింది అతని తండ్రే. ఆరేళ్ల వయసులో కొడుక్కి గంజాయి అలవాటు చేశాడు సీనియర్‌ డానీ. వయసు పెరిగాక తండ్రీకొడులిద్దరూ కలిసి మందు కొట్టేవాళ్లు.. డ్రగ్స్‌ తీసుకునేవాళ్లు. అది తనజీవితాన్ని కొన్నాళ్లపాటు అతలాకుతలం చేసినప్పటికీ.. తండ్రితో ఎమోషనల్‌‌‌‌గా బంధాన్నిబలపరిచిందంటాడు డానీ.

ఐదేళ్ల బ్యాడ్‌ టైమ్‌
థియేటర్‌ ఆర్టిస్ట్‌‌‌‌గా ప్రతిభ చూపటంతో 1980నుంచి రాబర్ట్‌‌‌‌ డానీ(జూనియర్‌ )కి సినిమా ఆఫర్లుమొదలయ్యాయి. మొదట్లో కొన్ని సినిమాల్లో చిన్న  పాత్రల్లో నటించి.. ‘ది పికప్‌ ఆర్టిస్ట్‌‌‌‌’ సినిమాతోహీరో అవతారం ఎత్తాడు. 1987లో రి లీజ్‌అయిన ‘లెస్‌‌‌‌ దేన్‌ జీరో’ సినిమాలో డ్రగ్‌ కి బానిసైనధనికుడు జులియన్‌ వెల్స్‌ పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. అతని కెరీర్‌ ను మలుపుతిప్పిన చిత్రం అదే. అయితే తన నిజజీవితానికి దగ్గరగా వెల్స్‌ పాత్ర ఉందంటూ మీడియాకు ఓపెన్‌స్టేట్‌ మెంట్‌ ఇచ్చాడు. ‘చాన్సెస్‌‌‌‌ ఆర్‌ ’, ‘ఎయిర్‌ అమెరికా’ చిత్రాలతో డానీ స్థాయి పెరిగి అగ్రహీరోల చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చాయి.

1992లో రి లీజ్‌ అయిన ‘చార్లీ చాప్లిన్ ’ డానీకెరీర్‌ లో ప్రత్యేకమనే చెప్పాలి. ఈ చిత్రానికిగాను ఆస్కార్‌ అవార్డులకు ‘ఉత్తమ నటుడు’ కేటగిరీలో డానీ పేరు నామినేట్‌ అయ్యింది. తర్వాత డానీ నటించిన ‘రిస్టొరేషన్‌ ’ రెండు ఆస్కార్‌ అవార్డులను గెలుచుకోగా, ‘రిచర్డ్‌‌‌‌–3’, ‘టూ గర్ల్స్‌ అండ్‌ ఏగాయ్‌ ’, ‘యూఎస్‌‌‌‌ మార్షల్‌‌‌‌’, ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌ ’ చిత్రాలు మిశ్రమ స్పందన దక్కించుకున్నాయి. 1996 నుంచి ఐదేళ్లపాటు డానీ కెరీర్‌ చీకట్లో కొనసాగింది. ఓ రోజు అర్ధరాత్రి డ్రగ్స్‌ కోసం డీలర్లకు ఫోన్‌ చేసి ఫస్ట్‌‌‌‌ టైం పోలీసులకు పట్టుబడ్డాడు. అక్కడ నుంచి తరచూ పోలీసులకు చిక్కడం, బెయిల్‌‌‌‌పై రావడం, మళ్లీ డ్రగ్స్ తీసుకుంటూ దొరకడం, లోపలికి వెళ్లడం.. ఇలా డజను సార్లుపైనే జరిగింది.

ఈ మధ్యలో కోర్టు తీర్పుతో కొన్నాళ్లపాటు రిహాబ్‌ సెంటర్‌ లో గడపటం, నాలుగైదు నెలలకు బయటకు రావడం.. డానీకి అలవాటైపోయింది. డానీ పతనం గురించి మీడియా సంస్థలు ప్రముఖంగా కథనాలు ప్రచురించాయి. ఆ అవమానాలు తట్టుకోలేక మొదటి భార్య, నటి ఆరా జెస్సీకా పార్కర్‌ డానీని విడిచిపెట్టింది. రెండోభార్య, సిం ర్‌ సుసాన్‌ లెవిన్‌ 2001లో డానీకి బ్రేకప్‌ చెప్పింది. ఓవైపు పర్సనల్‌‌‌‌, మరోవైపుకెరీర్‌ రెండింట్లోనూ లూజర్‌ గా డానీని అభివర్ణిస్తూ మీడియా కథనాలు వెలువడ్డాయి. సరిగ్గా అప్పుడే నిర్మాత సుసాన్‌ లెవిన్‌ తో పరిచయం అతని జీవితంలో వెలుగు నింపింది.

బ్లాక్ బస్టర్ హీరో
మూడు దశాబ్దాల హాలీవుడ్ కెరీర్ రాబర్ట్ డానీ (జూనియర్ )ని స్టార్ హీరోగా మార్చలేకపోయింది. ఈ మధ్య కాలంలో ఫెర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న చిత్రాల్లో నటించినా లాభం లేకుండా పోయింది. కెరీర్ స్ట్రగుల్ కొనసాగుతున్న టైంలో డానీ తలరాతను మార్చేసింది ‘ఐరన్ మ్యాన్ ’ చిత్రం. నలభై మూడేళ్ల వయసులో మార్వె ల్సూపర్ హీరోగా చేయడం కరెక్టే నా అనే అనుమానంతోనే సినిమాలో నటించాడు డానీ. కానీ, ఆ అనుమానాన్ని పటాపంచలు చేస్తూ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అదే ఏడాది డానీ నటించిన ‘ట్రోపిక్ థండర్ ’ అతనికి ఇంకో బ్లాక్ బస్టర్ ను అందించింది. రెండు బ్యాక్ టూబ్యాక్ కమర్షియల్ సక్సెస్లతో డానీ లైమ్ లైట్ లోకి వచ్చాడు. వరుసగా‘షెర్లాక్ హోమ్స్ ’, ‘ఐరన్ మ్ యాన్ –2’, ‘డ్యూ డేట్ ’, ‘షెర్లాక్ హోమ్స్ :ఏ గేమ్స్ ఆఫ్ షాడోస్’, ‘ది అవెం జర్స్ ’, ‘ది జడ్జ్’, ‘ఐరన్ మ్ యాన్ –3’, ‘అవెంజర్స్ : ఏజ్ ఆఫ్ ఆల్ట్రాన్ ’, ‘కెప్టెన్ అమెరికా: సివిల్ వార్ ’, ‘స్పైడర్ మ్యాన్ : హోం కమింగ్ ’, ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్ ’, ‘అవెంజర్స్ : ఎండ్ గేమ్ ’ చిత్రాలన్నీ డానీని టాప్హీరోగా నిలబెట్టాయి. ఒకప్పుడు విమర్శిస్తూ వ్యాసాలురాసిన మీడియా చానెళ్లే.. డానీని పొగుడుతూ వ్యాసాలురాశాయి.

వెటకారం ఎక్కువ
డానీ నటించిన చిత్రాల్లో కామెడీ జోనర్ సినిమాలే ఎక్కువ. వ్యక్తి గతంగానూ డానీ అంతే వెటకారపు మనిషి. కరెక్ట్ టైమింగ్ తో ఎదుటి వాళ్లపై జోకులేస్తుంటాడు. 1999లో డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాక పోలీసులు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టారు . ‘డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నావ్ ?’ అని జడ్జి అడిగిన ప్రశ్నకు.. అంతే సెటైరిక్ గా సమాధానం ఇచ్చాడు. ‘డ్రగ్స్ తీసుకుంటే నాకునోట్లో తుపాకీ పెట్టుకుని కాల్చుకున్నంత హాయిగా ఉంటుంది’ అంటూ డానీ చెప్పటంతో జడ్జితో పాటు కోర్టు హాల్ మొత్తం గొల్లుమని నవ్వింది. డ్రగ్స్ ఎక్కువైతే ఆ మత్తులో ఇంటికి వెళ్లకుండా.. కనిపించిన ఇంట్లోకి దూరి మంచంపై కునుకు తీసేవాడట. డానీ దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. ఎదుటి వాళ్ల కంటే తనపై తాను ఎక్కువ జోకులేసుకుని నవ్వించడం. సేవా కార్యక్రమాలు, రాజకీయాల్లోనూ యాక్టివ్ గా ఉండే డానీ.. తనలా మరెవరి జీవితం మత్తు మాయలో పడకూడదంటాడు. అందుకే తానే స్వయంగా కొన్ని కాలేజీలకు వెళ్లి తన జీవితాన్నే ఓ పాఠంగా చెబుతుంటాడు డానీ.

స్పెషల్ కమ్‌ బ్యాక్‌
2001లో అరెస్ట్‌‌‌‌ ఆఖరిది. రిహాబ్‌ సెంటర్‌ నుంచి బయటికొచ్చాడు డానీ. అప్పటి నుంచి రెండేళ్లపాటు అడపాదడపా డ్రగ్స్‌ తీసుకుంటూనే పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ దెబ్బకు కుటుంబ సభ్యులు అతన్ని దూరం పెట్టారు . ఒంటరి అయిన డానీ, మత్తు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని చేయని ప్రయత్నమంటూ లేదు. ధ్యానం, యోగ, కుంగ్‌ ఫూ, స్పెషల్‌‌‌‌ ప్రోగ్రామ్స్‌ ట్రీట్‌ మెంట్‌.. ఇలా ఎన్నో యాక్ టివిటీలను సాధన చేశాడు. సినిమా అవకాశాల కోసం నిర్మాతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. ఆ సమయంలోనే సుసాన్‌ లెవిన్‌ దగ్గరయ్యింది. రీఎంట్రీ చిత్రం ‘గోతికా’యావరేజ్‌ గా ఆడినా.. తర్వాత వచ్చిన‘కిస్‌‌‌‌ కిస్‌‌‌‌ బ్యాంగ్‌ బ్యాంగ్‌ ’ సూపర్‌ హిట్‌ కావడంతో డానీకి మళ్లీ అవకాశాలు వెల్లువెత్తాయి. కానీ, నటుడిగా పేరును మాత్రం ఇవ్వలేకపోయాయి. మరోవైపు స్నేహితురాలిగా ఉన్న సుసాన్‌ తో వివాహం అయ్యాక వ్యక్తిగత జీవితం సాఫీగా సాగింది.

Latest Updates