భోజనం వడ్డిస్తున్న రోబోలు

వారమంతా కష్టపడుతూ… వీకెండ్స్ లో టేస్టీ ఫుడ్ కోసం హోటల్స్ కి వెళ్తున్నారు సిటీ జనం.  అందుకే రెస్టారెంట్స్ కొత్త కొత్త థీమ్స్ తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.  పల్లె అందాలతో పాటు వివిధ రాష్ట్రాల, సంస్కృతుల థీమ్స్ పరిచయం చేస్తున్నాయి.  అయితే జూబ్లీ హిల్స్ లోని ఓ హోటల్ మాత్రం కొత్త టెక్నాలజీని పరిచయం  చేసింది.  నాలుగు  చిట్టి రోబోలతో ఫుడ్ సర్వ్  చేయిస్తోంది. ఇంకా  ఆ హోటల్ స్పెషలిటీ ఏంటో చూద్దాం ..

ఈ మధ్య రోబో సినిమాలో చూసిన చిట్టి రోబో ఇక్కడ కనిపిస్తుందేంటి అనుకుంటున్నారా.. అదేదో పిల్లలు ఆడుకునే రోబో అనుకోకండి.  మీరు చూస్తోంది నిజమైయిన రోబోనే.. ఇది  సినిమాలో లాగా పైట్లు, డ్యాన్యులు చేయకపోయినా… టేస్టీ ఫుడ్ ను మాత్రం సర్వర్ కంటే బెస్ట్ గా అందిస్తుంది.. దీనినే సర్వర్ రోబో అని కూడా పిలుస్తారు.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో రోబో కిచెన్ అనే  పేరుతో ఏర్పాటైన హోటల్లో  ఇవి పని చేస్తున్నాయి.

ఏ మంచి హోటల్ కి వెళ్లినా గంట లేదా గంటన్నర మాత్రమే ఉంటాం… అది కూడా ఉన్నంత  సేపు తినగానే పోవాలి అనుకుంటారు. కొందరైతే ఏదో తినడానికే వచ్చాం  కాబట్టి లుక్స్ ఆన్ ఫుడ్ అంటూ గబా గబా తినేస్తుంటారు. ఇలాంటి వారు ఫుడ్ టేస్ట్ ఎలా ఉన్నా పట్టించుకోరు. అందుకే  రెస్టారెంట్ లో ఉన్నంత సేపు కస్టమర్లను ఆకట్టుకోవాలన్న కొత్త ఐడియా తో ఈ రోబోలను తీసుకొచ్చామంటున్నారు నిర్వాహకులు..

హైదరాబాద్ కి చెందిన నలుగురు కుర్రాళ్లు సెల్ఫ్ గా ఈ రోబోలను పరిచయం చేసారు.. ఇక్కడ  సర్వర్లు మాత్రమే డిఫరెంట్ కాదు ఫుడ్ ఆర్డర్ విధానం కూడా కొత్తగానే అనిపిస్తుంది… పూర్తిగా సెన్సార్ తో నడిచే ఈ చిట్టి రోబోలకు రోజుకి 3 గంటల ఛార్జింగ్ అవసరం. ఇక్కడున్న నాలుగు రోబోలు… సర్వ్ చేయడంతో పాటు కస్టమర్లతో మాట్లాడతాయి.. ఇలాంటి రోబోలతో ఉన్న హోటళ్లు దేశంలో 6 మాత్రమే ఉన్నాయి… ఫుడ్ ఇండస్ట్రీ లో టేస్ట్ తో పాటు టెక్నాలజీ ని కూడా యాడ్ చేయడం మెయిన్ కాన్సెప్ట్ గా చెపుతున్నారు ఈ చిట్టి రోబోల నిర్వాహకులు…

కస్టమర్లు కూడా ఈ రోబోస్ కి ఫిదా అయితున్నారు…. సాధారణంగా పిల్లలతో హోటల్ కి వెళ్లాలంటే చాలామంది భయపడతారు. వాళ్ళు చేసే అల్లరిని భరించలేమని అంటుంటారు. ఇక్కడ మాత్రం ఫుడ్ టేస్ట్ తో పాటు ఇలాంటి కొత్త టెక్నాలజీ ను పరిచయం చేయడం హ్యాపీ గా ఉందని అంటున్నారు. అచ్చం  సినిమాలో చూసినట్టే అనిపించడంతో వీటితో సెల్ఫీస్ దిగుతూ సంబర పడుతున్నారు నగర వాసులు. రాబోయే రోజుల్లో సెల్ఫ్ గా మాట్లాడే రోబోస్ ని కూడా పరిచయం చేస్తామని అంటున్నారు నిర్వాహకులు..

Latest Updates