హైటెక్ రెస్టారెంట్ లో రోబో సర్వర్

రోజుకో థీమ్‌తో ఆకట్టుకునే రెస్టారెంట్లు వస్తున్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో వడ్డించే రోబోలతో కిచెన్‌ రోబో రెస్టారెంట్ ప్రారంభమైంది. అన్నిరంగాల్లో అభివృద్ధిచెందుతున్న హైదరాబాద్.. ఫుడ్ రెస్టారెంట్ల నిర్వహణలోనూ ముందుకెళ్తుంది. హోటల్ అంటేనే యూనిక్ గా ఉండాలి. వచ్చిన వాళ్ల మనసు కాస్త రిలాక్స్ కావాలి. బయటి ప్రపంచాన్ని మరిచి నచ్చిన రుచులు ఆస్వాదించాలని కోరుకునేవాళ్ల కోసం ఏర్పడిందే ఈ రోబో కిచెన్. సాధారణంగా ఏ చైనాలోనో, జపాన్లోనో కాకుండా మొదటిసారి మన హైదరాబాద్ లో వడ్డించే రోబోలు వచ్చేశాయ్.

హైదరాబాద్ కు చెందిన మణికాంత్ గౌడ్, ప్రసీద్, మణికంఠ యాదవ్ముగ్గురు స్నేహితులు. ప్రసీద్ చిన్నప్పటి నుంచే ఫుడ్ లవర్. నోరూరించే రెస్టారెంట్లు ఎక్కడ కనిపిస్తే అక్కడ వాలిపోయేవాడు. ఫుడ్ ను ఇష్టంగా తినేవాడు. మణికంఠ యాదవ్ కూడా ఫుడ్ లవర్. ప్రస్తుతం బీటెక్ చదువుతున్నాడు. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని, ఫుడ్ బిజినెస్ అయితే బాగుంటుందనేది ఇతని ఆలోచన. వీళ్లిద్దరి ఐడియాలజీని అర్థం చేసుకున్న వ్యక్తి మణికాంత్ గౌడ్. ‘‘ఏదైనా బిజినెస్ చేస్తే యూనిక్ ఉండాలి. దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. నోరూరించే రుచులు అందించాలి. అందుకే ‘రోబో కిచెన్’ స్టార్ చేట్శాం” అంటారు వీళ్లు.

ట్యాబ్ ద్వారా ఆర్డర్ ఇవ్వగానే.. రోబోలు నేరుగా టేబుల్ దగ్గరికే ఫుడ్ ఐటమ్ తీసుకొస్తాయి. పట్టుకొచ్చిన ఫుడ్ ను తీసుకునే వరకు అక్కడే వేచి ఉంటాయి. రోబోకు ఎడమవైపున ఎగ్జిట్ బటన్ ఉంటుంది. అక్కడ నొక్కగానే మళ్లీ కిచెన్ వైపు వెళ్తుంది. స్వయంగా రోబో వచ్చి ఫుడ్ ఐటమ్స్ అందిస్తుండటం కస్టమరకు ఆశ్చర్యంగా, సరదాగా ఉంటుంది. కొంతమంది మాత్రం రోబోపై చెయ్యి వేసి, బుంగమూతి పెట్టి సెల్ఫీలు దిగుతున్నారు. కొద్దిసేపు రోబోను చూసి ఎగ్జిట్ బటన్ నొక్కుతుంటారు. అంతేకాదు.. ఏయే పదార్థాలు ఆర్డర్ ఇచ్చారో చెప్పి మరీ వెళ్తాయి. ‘రోబోలను మున్ముందు మరింత డెవలప్ చేసి, నిజమైన సర్వర్లుగా ముందుకు తీసుకొస్తామంటున్నారు’ హోటల్ యజమానులు.

‘రోబో కిచెన్ కదా.. రచులు అంతంత మాత్రమే ఉంటాయ్’ అనుకునేవాళ్లు కూడా ఉంటారు. ఇక్కడ రోబోలతో పాటు రుచులు కూడా ప్రత్యేకమైనవే. నాణ్యతలో ఏమాత్రం కాంప్రమైజ్ కాబోమంటున్నారు రెస్టారెంట్ యజమానులు. పాకశాస్త్రంలో నైపుణ్యం సాధించిన, పదిహేనేళ్ల అనుభవం ఉన్న చెఫ్ లున్నారు. వారి సమక్షంలో వంటలు వండుతారు. ఫుడ్ లవర్స్ ను దృష్టిలో పెట్టుకుని వెజ్, నాన్ వెజ్ సెక్షన్లు వేర్వేరుగా ఉంటాయి. ఏమాత్రం కల్తీ లేకుండా రుచికరమైన వంటకాలను హాయిగా లాగించేయొచ్చు. ఇక్కడ రేట్లు కూడా బడ్జెట్‌డ్జె లోనే.

Latest Updates