కరోనా బాధితుల సేవలో రోబోలు

చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తోంది కరోనా వైరస్. కరోనా వ్యాధి వందలాది మంది చనిపోగా…వేలాది సంఖ్యలో బాధపడుతున్నారు. కరోనా వైరస్ సోకిన వారికి మెడికల్ ట్రీట్ మెంట్ ఇచ్చే డాక్టర్లతో పాటు…వారికి సేవలు చేసేవారికి కూడా ఆ వైరస్ సోకే అవకాశముంది. ఈ వ్యాధి నివారణకు ఇంకా మెడిసిన్ కూడా కనిపెట్టక పోవడంతో…వైరస్ సోకిన వారికి సేవలు చేసేందుకు వెనుకాడుతున్నారు. దీంతో కరోనా రోగులకు ఆహారం, మెడిసిన్  సరఫరా చేయడం చైనాలో సవాలుగా మారుతోంది.

అయితే కరోనా రోగులకు ఆహారం,  మెడిసిన్స్  అందించడానికి రోబోలను ఉపయోగించుకోవడం ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం లేదు.  చైనాలో కరోనా వ్యాధి సోకిన వారికి ఆహారం, మెడిసిన్స్ ను ఓ రోబో అందిస్తున్నట్టు ఉన్న ఒక వీడియోను ఓ యూజర్‌ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

ఇన్ఫెక్షన్లను నిరోధించగల ఈ ‘యూవీ డిస్‌ఇన్ఫెక్షన్‌’ రోబోట్లు ఆస్పత్రులను పూర్తిగా శుభ్రం చేసి, ఇన్ఫెక్షన్‌ రహితంగా చేయగలవు. అ రోబోలు ఆస్పత్రి ప్రాంతాల్లో వైరస్‌ను పూర్తిగా అరికడుతాయి. అంతేకాదు 360 డిగ్రీల కోణంలో ఎటువైపైనా కదలగలవు.  ఈ రోబోట్లు…ఐసోలేషన్‌ వార్డుల్లో ఉన్న కరోనా రోగులకు సమయానికి ఆహారం, మందులు అందించటంతో పాటు ఆ ప్లేట్లను, ఔషధ వ్యర్థాలను తొలగించటం వంటి పనులను  సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాయట. దీని ద్వారా వ్యాధి వ్యాప్తిని నిరోధించటమే కాకుండా, సిబ్బందికి శిక్షణ తదితర అంశాలపై ఖర్చు, సమయం ఆదా అవుతాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.  అంతే కాదు ఎవరికీ ఎలాంటి వ్యాధులు సోకే అవకాశం లేవు.

Latest Updates