అమెరికా స్థావరంపై మరోసారి రాకెట్లతో దాడి

ఇరాక్ లోని అమెరికా సైనిక స్థావరంపై నిన్న(గురువారం) రాత్రి మరోసారి రాకెట్లతో దాడి జరిగింది. కిర్కుక్ ప్రావిన్సులో అమెరికా బలగాలు ఉన్న కే1 స్థావరంపై కత్యుషా రాకెట్లతో దాడి చేశారు. ఈ దాడుల్లో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. గత డిసెంబర్ 27న ఇదే స్థావరంపై రాకెట్లతో దాడి చేశారు. దాదాపు 30 రాకెట్లను ప్రయోగించారు. ఆ దాడుల్లో అమెరికాకు చెందిన ఒక ఉన్నతాధికారి చనిపోయాడు. దీనికి కారణం హెజ్బోలా ఉగ్రవాద సంస్థ అని అప్పట్లో అమెరికా ఆరోపించింది. ఆ తర్వాత అమెరికా జరిపిన ప్రతీకార దాడుల్లో 25 మంది హెజ్బోలా ఉగ్రవాదులు మృతి చెందారు.

ఇరాన్ టాప్ కమాండర్ ఖాసిం సులేమానీని అమెరికా హతం చేసిన తర్వాత… రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో ఇరాన్ కు చెందిన పలు ఉగ్ర సంస్థలు అమెరికా స్థావరాలపై దాడులకు దిగుతున్నాయి. లేటెస్ట్ గా జరిగిన దాడులతో… ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Latest Updates