క్వార్టర్స్‌లో బోపన్న జోడీ

రోటర్‌ డ్యామ్‌ ఓపెన్‌లో భారత టెన్నిస్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న జోడీ క్వార్టర్స్‌ చేరింది. పురుషుల డబుల్స్‌లో బోపన్న కెనడా ప్లేయర్ డెన్నిస్‌ షపొవాల్వో జంట 7-6, 6-7, 10-8తో ఆస్ట్రేలియాకు చెందిన జాన్‌ పీర్స్‌ మైకెల్‌ వీనస్ పై విజయం సాధించి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జోడీ అద్భుతమైన పోరాటంతో విజేతగా నిలిచింది. నిర్ణయాత్మక మూడో సెట్‌లో బోపన్న తన సత్తా చాటి ప్రత్యర్థి జోడీని కంగుతినిపించాడు. క్వార్టర్స్‌లో బోపన్న జోడీ నాలుగో సీడ్‌ జీన్‌ రోజర్‌హోరియ టెకావుతో తలపడనుంది.

Latest Updates