రోహిత్‌‌, మయాంక్‌‌కు కెరీర్‌‌ బెస్ట్‌‌ ర్యాంక్స్‌‌

దుబాయ్‌‌: సౌతాఫ్రికాతో తొలి టెస్టులో సెంచరీలతో సత్తాచాటిన ఇండియా బ్యాట్స్‌‌మెన్‌‌ రోహిత్‌‌ శర్మ, మయాంక్‌‌ అగర్వాల్‌‌.. ఐసీసీ సోమవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌‌లో కెరీర్‌‌ బెస్ట్‌‌ ర్యాంకులు దక్కించుకున్నారు. తొలి టెస్టులో రెండు సెంచరీలు చేసిన రోహిత్‌‌ ఏకంగా 36 స్థానాలు ఎగబాకి 17వ ర్యాంకుకు దూసుకెళ్లాడు. 38 స్థానాలు మెరుగుపర్చుకున్న మయాంక్‌‌ 25వ ర్యాంకులో నిలిచాడు.

ఇండియా కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీలో నం.2లోనే ఉన్నా పాయింట్లలో ఏడాదిన్నర తర్వాత తొలిసారి 900 మార్కు కిందకు దిగజారాడు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 899 పాయింట్లు ఉన్నాయి. విరాట్‌‌కంటే38 పాయింట్ల ఆధిక్యంతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌‌ స్టీవ్‌‌ స్మిత్‌‌ నం.1 ర్యాంకులో నిలిచాడు.

Latest Updates