వరల్డ్ టి20 కెప్టెన్ గా రోహిత్ శర్మ

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ టామ్‌మూడీ ప్రకటించిన వరల్డ్‌ టీ20 జట్టుకు హిట్‌ మ్యాన్‌ రోహిత్‌  శర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్‌ జట్టు సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌కు హెడ్‌కోచ్‌గా ఉన్న టామ్‌మూడీని కామెంటేటర్‌ హర్షాభోగ్లే ప్రస్తుత తరం క్రికెటర్లతో వరల్డ్‌ టీ20 జట్టును ప్రకటించాల్సిందిగా కోరాడు. దీంతో జట్టుకు రోహిత్‌ని ఓపెనర్‌గా ఎంపిక చేసిన మూడీ అతడికి టీం కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించాడు. ధోనీకి ఈ జట్టులో చోటు దక్కలేదు. టామ్‌మూడీ వరల్డ్‌ టీ20 జట్టులో రోహిత్‌శర్మ(సి), డేవిడ్‌ వార్నర్‌, విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలయర్స్‌, నికోలస్‌ పూరన్‌ (కీపర్‌), రసెల్‌, సునీల్‌ నరైన్‌, మిచెల్‌ స్టార్క్‌, రషీద్‌ ఖాన్‌, బుమ్రా, జోఫ్రా ఆర్చర్‌ ఎంపిక కాగా 12వ ఆటగాడిగా రవీంద్ర జడేజా ఎంపికయ్యాడు. ఓపెనర్స్ గా రోహిత్‌ శర్మ, డేవిడ్‌ వార్నర్‌ లను ఎంపిక చేశాడు. మూడో నెంబర్‌కు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి అవకాశం ఇచ్చాడు. కీపర్‌ గా ధోనీ స్థానంలో వెస్టిండీస్‌ వికెట్‌ కీపర్‌ నికోలస్‌ పూరన్‌ను సెలక్ట్‌ చేశాడు టామ్.

Latest Updates