వరల్డ్ కప్ మొనగాడు రోహిత్ : 5 సెంచరీలతో అదరగొట్టాడు

rohit-sharma-brings-up-his-fifth-100

శ్రీలంకపై మ్యాచ్ లో రోహిత్ శర్మ రెచ్చిపోయాడు ఛేజింగ్ లో సెంచరీతో రోహిత్ శర్మ అదరగొట్టాడు.  ఈ మ్యాచ్ లో సెంచరీతో రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డ్ సాధించాడు. ఒకే వరల్డ్ కప్ లో ఐదు సెంచరీలు చేసి.. శ్రీలంక ప్లేయర్ సంగక్కర రికార్డ్ ను బ్రేక్ చేశాడు రోహిత్.

ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్ టోర్నీలలో 5 సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌ మెన్‌ గా రోహిత్ రికార్డులకెక్కాడు. అయితే, ఆ వెంటనే రజిత బౌలింగ్‌లో మాథ్యూస్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 94 బాల్స్ లో రోహిత్ 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 103 రన్స్ చేశాడు.

Latest Updates