శ్రీవారి సన్నిధిలో రోహిత్ శర్మ, దినేశ్ కార్తిక్

క్రికెటర్స్ రోహిత్ శర్మ, దినేశ్ కార్తిక్  తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్  దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. రోహిత్ శర్మ , దినేశ్ కార్తిక్ కు  ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు  తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం బయట రోహిత్ శర్మ దినేశ్ కార్తిక్ తో  అభిమానులు సెల్ఫీ తీసుకున్నారు.

Latest Updates