లైఫ్ దొరికినప్పుడల్లా రెచ్చిపోయిన రోహిత్ శర్మ

వరల్డ్ క్లాస్ ఆటగాడు, టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో లైఫ్ లభించింది. వ్యక్తిగత స్కోరు 9పై ఉన్నప్పుడు రోహిత్ శర్మ.. ముస్తాఫిజుర్ బౌలింగ్ లో షాట్ కొట్టాడు. డీప్ లో ఉన్న తమీమ్ ఎడమవైపుకు కదులుతూ దాన్ని అందుకోవడానికి ప్రయత్నించాడు. ఐతే.. క్యాచ్ జారవిడిచాడు. అది ఎంతో ముఖ్యమైన క్యాచ్ కావడంతో… చేసిన తప్పుకు ముఖాన్ని చేతులతో దాచుకున్నాడు.

మ్యాచ్ లో లైఫ్ దక్కడం కామన్. ఐతే.. దానిని సద్వినియోగం చేసుకున్నప్పుడే ఆటగాడి టాలెంట్ బయటకొస్తుంది. ఈ వరల్డ్ కప్ లో రోహిత్ కు ఈ మ్యాచ్ తో కలిపి 4 సార్లు లైఫ్ దక్కింది. గడిచిన 3 సందర్భాల్లో రోహిత్ శర్మ రెచ్చిపోయి ఆడాడు.

సౌతాఫ్రికాతో మ్యాచ్ లో వ్యక్తిగత స్కోరు 1 వద్ద రోహిత్ శర్మకు లైఫ్ వచ్చింది. ఆ మ్యాచ్ లో 122పరుగులతో నాటౌట్ గా నిలిచాడు రోహిత్.

ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో పర్సనల్ స్కోరు 2 దగ్గర రోహిత్ కు లైఫ్ వచ్చింది. ఆ మ్యాచ్ లో 57 రన్స్ చేశాడు శర్మ.

ఇంగ్లండ్ తో మ్యాచ్ లో 4 రన్స్ దగ్గర రోహిత్ కు లైఫ్ వచ్చింది. ఆ మ్యాచ్ లో 102 రన్స్ చేశాడు రోహిత్ శర్మ.

తాజాగా బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో 9 రన్స్ దగ్గర లైఫ్ వచ్చింది. ఈ మ్యాచ్ లోనూ రోహిత్ శర్మ రెచ్చిపోయి ఆడాడు. కేఎల్ రాహుల్ తో కలిసి ఇండియాకు శుభారంభం అందించాడు.

Latest Updates