సెంచరీతో నిలబెట్టిన రోహిత్ శర్మ.. హయ్యెస్ట్ సిక్సర్ల రికార్డ్ బ్రేక్

రాంచీ : సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులోనూ తన అద్భుతమైన ఫామ్ ను కొనసాగించాడు రోహిత్ శర్మ. సెంచరీ పూర్తిచేశాడు. 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఇండియా కష్టాల్లో ఉన్నప్పుడు… ఓపెనర్ రోహిత్ శర్మ నిలకడగా ఆడాడు. వీలు చిక్కినప్పుడు బౌండరీలు బాది స్కోరు బోర్డును పెంచాడు. మరోవైపు.. రహానే కూడా చక్కటి సహకారం అందించాడు. 58 ఓవర్లకు ఇండియా 224/3 స్కోరు మీదున్నప్పుడు బ్యాడ్ లైట్ కారణంగా ఆట నిలిపివేశారు. ఆ తర్వాత వర్షం కూడా పడింది.  ఆట ముగిసే సమయానికి రోహిత్ శర్మ(117 బ్యాటింగ్), రహానే(83 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. రోహిత్, రహానే కుదురుకోవడంతో.. ఇండియా అప్పర్ హ్యాండ్ సాధించింది.

రోహిత్ శర్మ అత్యధిక సిక్సర్ల రికార్డ్

రోహిత్ సిక్స్ కొట్టి 131 బంతుల్లో 101 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందులో 13 ఫోర్లు,4 సిక్సులున్నాయి. ఇవాళ 4 సిక్సులతో చెలరేగిన హిట్ మ్యాన్ ఈ ఏడాది టెస్టుల్లో  అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. 16 సిక్సులతో విండీస్ బ్యాట్స్ మన్ షెమ్రాన్ హెట్ మెయిర్ రికార్డును రోహిత్ శర్మ తిరగరాశాడు. హర్భజన్(14 సిక్సులు), హెట్ మెయిర్ (15సిక్సులు) తర్వాత.. రెండు దేశాల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో అత్యధిక సిక్సులు కొట్టిన రికార్డ్ ఇపుడు రోహిత్ పేరిటే ఉంది. ఆట ముగిసే సమయానికి రోహిత్ శర్మ ఖాతాలో.. ఈ సిరీస్ లో 4 ఇన్నింగ్సుల్లో కలిపి 17 సిక్సులు చేరాయి. 

3 టెస్టులు.. 3 సెంచరీలు..

రోహిత్ శర్మ మొదటి టెస్టులోని రెండు ఇన్నింగ్సుల్లో రెండు సెంచరీలు బాదాడు. మరోసారి ఇవాళ మూడో టెస్టులో సెంచరీ చేశాడు. టెస్టుల్లో రోహిత్ కు ఇది 6వ సెంచరీ. అంతేగాకుండా టెస్టుల్లో 2 వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు రోహిత్. మరో బ్యాట్స్ మెన్ రహానే నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  

Latest Updates