హిట్ మ్యాన్ మరో రికార్డ్..వరుసగా 8వ సారి..

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో రికార్డ్ సృష్టించాడు. వన్డేల్లో 2020లో  అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. ఈ ఏడాది జనవరి 19న ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో రోహిత్ 119 పరుగు చేశాడు. ఈ ఏడాది వన్డేల్లో భారత్ నుంచి ఇదే  అత్యధిక స్కోరు.  అంతే కాదు రోహిత్ వన్డేల్లో అత్యధిక స్కోరు చేయడం ఇది వరుసగా 8 వ సారి .2013 నుంచి భారత్ నుంచి వన్డేల్లో అత్యధిక వ్యక్తి స్కోరు రోహిత్ శర్మదే కావడం గమనార్హం . ఆస్ట్రేలియాతో మూడు వన్డేల్లో కూడా ఏ ఒక్క భారత ప్లేయర్ సెంచరీ చేయలేదు. ఆసీస్ జరిగే వన్డేలకు,టీ20లకు రోహిత్ ను ఎంపిక చేయలేదు.

Latest Updates