ఖడ్గమృగాలను కాపాడే బాధ్యత చేపట్టిన రోహిత్ శర్మ

టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ భారత ఖడ్గమృగాల్ని కాపాడే బాధ్యత చేపట్టాడు.మన దేశంలోని కొమ్ము ఖడ్గమృగాలు… అరుదైనవి. అవి మన దేశానికే సొంతం. ఒకప్పుడు… లక్షల్లో ఉండే ఈ రైనోలు…. ఇప్పుడు 20వేల కంటే తక్కువే ఉన్నాయి. ఫలితంగా అంతరించిపోయే జాతుల లిస్టులో చేరిపోయాయి. ఇందుకు అనేక కారణాలున్నాయి. ఒకటి వేటగాళ్లు… రెండోది తగ్గిపోతున్న అడవుల విస్తీర్ణం. వేటగాళ్ల చర్యల్ని చాలా వరకూ… అస్సాం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నాయి. అయితే… అడవుల్లో భాగమైన… అల్యూవియల్ గడ్డి మైదానాల్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ గడ్డి లేకపోవడంతో చాలా ఖడ్గమృగాలు చనిపోతున్నాయని తెలిసింది. ఈ గడ్డి మైదానాల్ని పెంచేందుకు… వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) ఇండియా ప్రయత్నిస్తోంది. పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తోంది. ఇందులో భాగంగా… టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సాయం తీసుకుంది.ఆయన ద్వారా ప్రచారం చేయిస్తోంది. ఖడ్గమృగాల్ని కాపాడదామని పిలుపునిస్తున్న రోహిత్ శర్మ… విరాళాలు ఇవ్వాల్సిందిగా ఫ్యాన్స్‌ని కోరుతున్నాడు.