ఏ పొజిషన్‌‌లో బ్యాటింగ్ చేయడానికైనా రెడీ

బెంగళూరు: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో ఓపెనర్‌‌గా బరిలోకి దిగడానికి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఉవ్విళ్లూరుతున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్స్‌‌ తీసుకోనున్న సంగతి తెలిసిందే. దీంతో చివరి మూడు టెస్టుల్లో వైస్ కెప్టెన్ అజింక్యా రహానె, సీనియర్ బ్యాట్స్‌‌మన్ ఛతేశ్వర్ పుజారాతో కలసి రోహిత్ కీలక పాత్ర పోషించే చాన్స్ ఉంది. ఈ సిరీస్ గురించి రోహిత్ పలు వ్యాఖ్యలు చేశాడు. ఏ ప్లేస్‌లోనైనా ఆడేందుకు తాను రెడీ అని చెప్పాడు. ఐపీఎల్ పదమూడో సీజన్‌‌లో హ్యామ్‌‌స్ట్రింగ్ ఇంజ్యూరీకి గురైన రోహిత్.. కొన్ని మ్యాచులకు దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌‌సీఏ)లో ట్రెయినింగ్‌‌లో ఉన్న అతడు.. గాయం నుంచి రికవరీ అవుతున్నానని చెప్పాడు. తన బ్యాటింగ్ పొజిషన్ గురించి రోహిత్ మాట్లాడాడు.

‘ఇన్నాళ్లుగా అందరికీ చెప్పే విషయమే మళ్లీ చెబుతున్నా. టీమ్ నన్ను ఏ పొజిషన్‌‌లో ఆడాలని కోరుకుంటే ఆ ప్లేస్‌‌లో బ్యాటింగ్ చేయడానికి నేను సిద్ధమే. కానీ వాళ్లు నా ఓపెనింగ్ రోల్‌‌ను మారుస్తారో లేదో నాకైతే తెలియదు. ఆస్ట్రేలియాలో ఉన్న మనోళ్లు.. విరాట్ వెళ్లిపోతే ఓపెనింగ్ ఎవరు చేయాలనే దానిపై ఇప్పటికే స్పష్టతకు వచ్చుంటారు. నేను అక్కడికి చేరుకున్నాక.. అక్కడేం జరుగుతుందనేది నాకూ తెలుస్తుంది. ఆసీస్‌‌లో బౌన్స్ గురించి మనం ఆందోళన చెందుతాం. కానీ గత కొన్నేళ్లుగా పెర్త్‌‌ను మినహాయిస్తే అడిలైడ్, ఎంసీజీ, ఎస్‌‌సీజీల్లో పెద్దగా బౌన్స్ లేదు. నేను బ్యాటింగ్ చేసే సమయంలో కట్, పుల్ షాట్లను సాధ్యమైనంత స్ట్రయిట్‌‌గా ఆడేందుకు యత్నిస్తున్నా’ అని రోహిత్ పేర్కొన్నాడు.

Latest Updates