‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2019’గా రోహిత్ శర్మ

ఐసీసీ(ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) 2019 సంవత్సరానికిగానూ అవార్డులను బుధవారం ప్రకటించింది. 2019లో వన్డే ఇంటర్నేషనల్ (వన్డే) ఫార్మాట్‌లో అత్యధిక స్కోరు సాధించిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌’గా ఐసీసీ ఎంపిక చేసింది. రోహిత్ శర్మ గత ఏడాది మొత్తం ఏడు సెంచరీలు సాధించాడు. అందులో ఐదు సెంచరీలు 2019 ప్రపంచ కప్‌లోనే సాధించాడు. దాంతో ప్రపంచ కప్ యొక్క ఒకే ఎడిషన్‌లో 5 సెంచరీలు సాధించిన మొదటి బ్యాట్స్‌మన్‌గా రోహిత్ నిలిచాడు. మార్క్యూ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను ఉత్సాహపరచాలంటూ ప్రేక్షకుల వైపు సైగ చేశాడు. 2018లో కేప్‌టౌన్‌లో జరిగిన మ్యాచ్‌లో స్మిత్ బాల్ ట్యాంపరింగ్ చేశాడని ఒక సంవత్సరం పాటు నిషేధానికి గురయ్యాడు. ఆ ఆరోపణకు సంబంధించి మార్క్యూ టోర్నమెంట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్‌ను కొంతమంది ప్రేక్షకులు గెలీ చేయడం చూసిన కోహ్లీ.. స్మిత్‌ను ఎంకరేజ్ చేయాలంటూ ప్రేక్షకులను కోరాడు. అందుకుగాను కోహ్లీ ‘స్పిరిట్ ఆఫ్ క్రికెట్’ అవార్డును గెలుచుకున్నాడు. ఆ మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడుతూ విరాట్ కోహ్లీ ప్రేక్షకుల తరపున స్టీవ్ స్మిత్‌కు క్షమాపణలు కూడా చెప్పాడు.

ఆస్ట్రేలియాకు చెందిన మార్నస్ లాబుస్‌చాగ్నేఈ ఏడాది ‘మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును గెలుచుకున్నాడు. మార్నస్ 11 మ్యాచ్‌ల్లో 1104 పరుగులు చేశాడు. ప్రపంచ కప్ 2019లో ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన బెన్ స్టోక్స్.. ‘సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ’ని దక్కించుకున్నాడు. 2019 టెస్ట్ క్రికెట్‌లో 59 వికెట్లు తీసిన పాట్ కమ్మిన్స్‌ను ‘ఐసీసీ టెస్ట్ క్రికెటర్‌ ఆఫ్ ది ఇయర్‌’గా ఎంపిక చేసింది. స్కాట్‌లాండ్‌కు చెందిన కైల్ కోట్జెర్‌ను ‘అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌’గా ఐసీసీ ప్రకటించింది.

టీ20 ఫార్మట్‌లో బంగ్లాదేశ్‌పై 6 పరుగులిచ్చి 7 వికెట్లు తీసిన దీపక్ చాహర్ ‘మెన్స్ టీ20 పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్నాడు. ఎన్నో మ్యాచ్‌లకు అంపైరింగ్ చేసిన రీచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ‘అంపైర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును గెలుచుకున్నాడు.

Latest Updates