ఎన్డీ తివారి కొడుకు రోహిత్ ది హత్యగా తేల్చిన పోలీసులు

ఏపీ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కొడుకు రోహిత్ శేఖర్ తివారీ  మృతి కేసులో  కీలక విషయాలు బయటపడ్డాయి. రోహిత్ ది సహజ మరణం కాదని..హత్యేనని పోస్టుమార్టం రిపోర్టులో బయటపడింది. రోహిత్ ను ఎవరో పిల్లోతో తలభాగంలో నుదిమి ఊపిరి ఆడకుండా చేసి చంపారని వెల్లడించారు పోలీసులు.  ఈ కేసును హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు ఢిల్లీ క్రైం బ్రాంచీకి  బదిలీ చేశారు. శుక్రవారం రోహిత్ ఇంటికి వెళ్లిన క్రైం బ్రాంచీ పోలీసులు కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. అక్కడ పలు కీలక సాక్షాలను స్వాధీనం చేసుకున్నారు. రోహిత్ ఇంటి దగ్గర ఉన్న  7 సీసీటీవీ కెమెరాల్లో 2 పనిచేయడం లేదని తెలుసుకున్న పోలీసులు ఆ దిశగా విచారిస్తున్నారు.

ఈ నెల 16న  ఇంట్లో రోహిత్  ముక్కు నుంచి తీవ్ర రక్తం వస్తుండగా ఢిల్లీలోని సాకేత్ మాక్స్ ఆస్పత్రిలో చేర్పించారు పని మనుషులు. అయితే అప్పటికే రోహిత్ తివారీ మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే రోహిత్ తల్లి మాత్రం తన కొడుకుది సహజ మరణం అని..ఎవరిపై అనుమానాలు లేవని చెప్పారు.

Latest Updates