పెళ్లి కాక ముందే నా భర్తకు కొడుకు: రోహిత్ తివారీ భార్య

తన భర్తకు పెళ్లికి ముందే వేరే అమ్మాయితో వివాహేత సంబంధం ఉందని..వాళ్లిద్దరికి ఓ కొడుకు కూడా ఉన్నారని ఆరోపించారు ఎన్డీతివారీ కొడుకు రోహిత్ తివారీ భార్య… అపూర్వ శుక్లా. రోహిత్ తివారీ హత్య కేసులో అరెస్ట్ అయిన అపూర్వ శుక్లా తన భర్తను హత్య చేసినట్లు  పోలీసుల ముందు అంగీకరించారు. తన భర్త హత్య గురించి  పోలీసుల విచారణలో వివరంగా చెప్పారు అపూర్వ. ‘ నా భర్తకు పెళ్లి కాకముందు దూరపు బంధువు అయిన అమ్మాయితో వివాహేతర సంబంధం ఉంది. వాళ్లిద్దరికీ కొడుకు కూడా ఉన్నాడు. ఆమె కూడా రోహిత్ ఆస్తిలో వాటా ఇవ్వాలని తరచూ అడిగేది. రోహిత్ కూడా ఆ పిల్లాడిపై ప్రేమ చూపిస్తుండడం, ఆప్యాయంగా ఉండటంతో నాకు అనుమానం వచ్చింది. ఆ కొడుకునే తన ఆస్తికి వారసుడిని చేయాలని రోహిత్ కూడా భావించేవారు.అందుకే రోహిత్ ను చంపేశా‘ అని అపూర్వ చెప్పారు.

‘ రాజకీయ ఆశయాలు ఉండటంతో  మ్యాట్రిమోనీయల్ సైట్ లో  ఎన్డీ తివారీ కొడుకు రోహిత్ తివారీని సెలక్ట్ చేసుకున్నా. తర్వాత కొన్ని రోజులు డేటింగ్ చేసి.. 2018 మే 11న పెళ్లి చేసుకున్నా. అయినా నా వైవాహిక జీవితం ఎక్కువ రోజులు ఆనందంగా గడపలేదు. తరచూ ఏవో గొడవలు వచ్చేవి. దీంతో 2018లోనే అత్తింటి నుంచి బయటకు వచ్చా. జూలైలో విడాకులు కావాలని నోటీసులు పంపా. కానీ రోహిత్ కు ఆరోగ్యం బాగ లేక ఆస్పత్రిలో చేరినప్పుడు  అతనితో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నా. కానీ రోహిత్ తల్లి నుంచి తరచూ వేధింపులు ఉండేవి‘ అని అపూర్వ  పోలీసులకు చెప్పారు.

Latest Updates