రోహిత్ తివారిది హత్యే.. భార్యే హంతకురాలు

Rohit tiwari wife apoorva arrested for his murder

న్యూ ఢిల్లీ: ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్‌ హత్య కేసులో కీలకపరిణామం చోటుచేసుకుంది. రోహిత్ తివారిని అతని భార్య అపూర్వ హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.  తాగిన మైకంలో ఉన్న రోహిత్ ను అపూర్వ అతడి తలపై దిండుతో అదిమి చంపిందని సీనియర్ పోలీస్ అధికారి రాజీవ్ రంజన్ తెలిపారు. పెళ్లైన నాటి నుంచి వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని.. ఆ కారణంగానే ఈ నెల 16 న అపూర్వ తన భర్తను ఊపిరాడనివ్వకుండా చేసి చంపిందని ఆయన అన్నారు. రోహిత్ గుండెపోటు  కారణంగా మృతి చెందలేదని ఆయన తెలిపారు.

Latest Updates