రోహిత్ మరో వరల్డ్ రికార్డ్..

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో రికార్డ్ సృష్టించాడు.రాజ్ కోట్ వన్డేలో 42 పరుగులు చేసి ఔటైన రోహిత్ ఒపెనర్ గా అత్యంత వేగంగా 7 వేల రన్స్ చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. రోహిత్ 137 ఇన్నింగ్సుల్లో ఈ రికార్డు సృష్టించగా.. అషీమ్ ఆమ్లా 147, సచిన్ 160 ఇన్నింగ్స్ ల్లో 7 వేల రన్స్ పూర్తి చేసుకున్నారు. 2013 నుంచి వన్డేల్లో రోహిత్ ఓపెనర్ గా బరిలోకి దిగుతున్నాడు. అంతేగాకుండా రోహిత్ రాజ్ కోట్ వన్డేలో 4 పరుగుల తేడాతో మరో రికార్డ్ మిస్ చేసుకున్నాడు.  మరో నాలుగు పరుగులు చేస్తే వన్డేల్లో 9  వేల రన్స్ పూర్తి చేసుకునే వాడు.

Latest Updates