సిక్స్ తో హిట్ మ్యాన్ డబుల్ సెంచరీ..ఔట్

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో రోహిత్ శర్మ తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. వన్డేల మాదిరిగా ఆడుతూ అలకోవగా సెంచరీలు బాదేస్తున్నాడు. నిన్న 95 పరుగుల వద్ద సిక్స్ కొట్టి సెంచరీ చేసుకున్న రోహిత్ ఇవాళ 199 పరుగుల వద్ద కూడా సిక్స్ కొట్టి డబుల్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. 249 బంతుల్లో 205 పరుగులు చేశాడు రోహిత్.  అదే ఊపులో మరో సిక్స్ బాదిన రోహిత్ 212 రన్స్ వద్ద  రబాడ బౌలింగ్ లో ఔటయ్యాడు.  ఇందులో 28 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. రోహిత్ కు టెస్టుల్లో ఇది ఫస్ట్ డబుల్ సెంచరీ. ఇప్పటి వరకు రోహిత్ కు టెస్టుల్లో 177 పరుగులే అత్యధికం. టోటల్ గా టెస్టుల్లో, వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన ఆటగాళ్లలో రోహిత్ నాల్గవ ఆటగాడు. రోహిత్ కంటే ముందు సచిన్, సెహ్వగ్, క్రిస్ గేల్ ఉన్నారు.

Latest Updates