రోహిత్ దూకుడు..టాప్ 10లో చోటు

రోహిత్ శర్మ ప్రస్తుతం క్రికెటర్లలో హాట్ టాపిక్. వరల్డ్ కప్ లో ఐదు సెంచరీలు, లెటెస్ట్ గా సౌతాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్ లో రెండు సెంచరీలు,ఒక  డబుల్ సెంచరీ బాది రికార్డ్ లు సృష్టిస్తూ మంచి ఊపు మీదున్నాడు. ఓపెనర్ గా టెస్టు సిరీస్ లో రాణించిన రోహిత్ మొదటి సారి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ టాప్ 10 లో చోటు దక్కించుకున్నాడు. సౌతాఫ్రికా సిరీస్ కు ముందు 44వ స్థానంలో ఉన్న రోహిత్ లేెటెస్ట్ గా 722 పాయింట్లతో 10 వ స్థానాన్ని దక్కించుకున్నాడు. రోహిత్ తో పాటు 926 పాయింట్లతో కోహ్లీ రెండవ ర్యాంకు, 795 పాయింట్లతో పుజారా నాల్గవ ర్యాంకు, 751 పాయింట్లతో రహానే ఐదవ ర్యాంకుతో ఉన్నారు. 937 పాయింట్లతో ఆస్ట్రేలియా క్రికెటర్ స్మిత్ ఫస్ట్ ప్లేసులో ఉన్నాడు.

ఇక వన్డేలో 895 పాయింట్లతో కోహ్లీ ఫస్ట్ ప్లేసులో ఉండగా 863 పాయింట్లతో రోహిత్ సెకండ్ ప్లేసులో ఉన్నారు. టీ20 ల్లో కూడా  664 పాయింట్లతో రోహిత్ 8 ర్యాంకు, 662 పాయింట్లతో  9 వ స్థానంలో లోకేష్ రాహుల్, 659 పాయింట్లతో 10 వ స్థానంలో కోహ్లీ ఉన్నారు. అయితే ప్రస్తుతం టెస్టు,వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి  ఐసీసీ ర్యాంకింగ్ లో టాప్ 10 లో ఉన్న భారత ఆటగాళ్లలో వీరాట్ తర్వాత రోహిత్ ఉండటం విశేషం.

Latest Updates