యువీ రికార్డ్ కు ఎసరు పెట్టిన హిట్ మ్యాన్

టీమిండియా  ఓపెనర్,హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సిక్సుల వీరుడు యువరాజ్ సింగ్ రికార్డ్ పై కన్నేశాడు. వన్డేల్లో రోహిత్ మరో 26 రన్స్ చేస్తే యువరాజ్ సింగ్ వన్డేల్లో చేసిన మొత్తం 8701 రన్స్ రికార్డ్ ను బ్రేక్ చేస్తాడు. యువరాజ్ సింగ్ 304 వన్డేల్లో 8701 రన్స్ చేస్తే..ప్రస్తుతం రోహిత్ 217 వన్డేల్లో 8676 రన్స్ చేశాడు. ఇవాళ(బుధవారం) వెస్టిండిస్ తో జరగనున్న మూడో వన్డేల్లో రోహిత్ యువరాజ్ సింగ్ రికార్డ్ ను  బ్రేక్  చేస్తాడని భావిస్తున్నారు  ఫ్యాన్స్. భారత్ తరపును వన్డేల్లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్లలో సచిన్ టెండుల్కర్ 18426 ముందున్నాడు. ఆ తర్వాత వీరాట్ కొహ్లీ 11406, గంగూలీ 11363, ద్రావిడ్10889, ధోని 10773, అజారుద్దీన్ 9378,యువరాజ్ 8701,రోహిత్ 8676 రన్స్ తో ఉన్నారు.

 

Latest Updates