జగన్ జనాదరణ చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు : రోజా

తిరుమలలో వేంకటేశ్వరస్వామిని ఈ ఉదయం దర్శించుకున్నారు ఎమ్మెల్యే రోజా. దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడిన రోజా… “YS జగన్ ప్రజాదరణ చూసి చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారు. అందుకే జగన్ ను నాగార్జున కలవడాన్ని కూడా సహించలేకపోతున్నారు. నేరారోపణలు, నేర చరిత్ర కలిగిన వారిని పక్కన పెట్టుకున్నది చంద్రబాబే. మామను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది. చంద్రబాబుపై 18 కేసులున్నా నేటి విచారణకు వెళ్లకుండా తిరుగుతున్నాడు. ఇంట్లో బాంబులు పేల్చిన కోడెల శివప్రసాద్, గన్ పేల్చిన బాలకృష్ణ పక్కన పెట్టుకున్నది చంద్రబాబు కాదా…? జగన్ మీలా కేసులకు భయపడలేదు, తాను చెయ్యని నేరాలను ఎదుర్కొంటున్నారు. హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నది చంద్రబాబే. అందుకే గరుడ ప్లాన్ తో జగన్ హత్య చేయించడానికి కుట్రపన్నారు. గత ఐదేళ్లుగా మాటలు మార్చుతూ యుటర్న్ సీఎం గా చంద్రబాబు పనితీరును జనం గమనిస్తూనే ఉన్నారు” అని రోజా అన్నారు.

Latest Updates