పసుపు కుంకుమ పేరుతో ఓట్లు కొనడం దారుణం : రోజా

రూ.10వేలకు మూడు చెక్కులు ఇచ్చి దానికి పసుపు కుంకుమ పేరు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారన్నారు నగరి ఎమ్మెల్యే రోజా. తిరుమల వెంకన్న దర్శనం తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. పసుపు కుంకుమ పేరుతో డబ్బులు పంచుతూ ఓట్లు కొనుక్కుంటున్నారని ఆరోపించారు. డబ్బులు ఇచ్చి ఓట్లు వేయాలని ప్రమాణం చేయించుకోవడం దారుణం అన్నారు.

మహిళలపై చంద్రబాబుకు గౌరవం ఉంటే రూ.14వేల 200 కోట్లు డ్వాక్రా రుణాలను మాఫీ చేయాల్సింది పోయి… ఆ అప్పును కాస్త పెంచి రూ.22 వేల కోట్లు చేశారని రోజా ఆరోపించారు. పసుపు కుంకుమ విలువ తెలిసిన వారు ఆ రుణాలు మాఫీ చెయ్యాలి కానీ, రూ.10 వేలు ఇచ్చి తాళి మీద ఒట్టు వేయించుకుని… ఓటు వేయాలని కోరడం చాలా దారుణం అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక మిగిలిన రెండు చెక్కులను ఈసీ అడ్డుకుంటుందని తెలిసే ఈ డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు.

Latest Updates