ఏపీ మంత్రుల ప్రమాణా స్వీకారానికి రోజా డుమ్మా!

roja-not-comming-on-ministers-ceromeny

హైదరాబాద్​, వెలుగు: ఏపీ మంత్రుల ప్రమాణస్వీకారోత్సవంలో ముగ్గురు నలుగురు వైఎస్సార్​సీపీ కీలక ఎమ్మెల్యేలు కనిపించలేదు. అందులో రోజా ఒకరు. శుక్రవారం సాయంత్రమే ఆమె అమరావతి నుంచి వెళ్లిపోయినట్లు కొందరు నేతలు చర్చించుకోవడం కనిపించింది. మంత్రి పదవి దక్కకపోవడంతోనే రోజా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ప్రచారం జరిగింది. రోజాకు జగన్​ కేబినెట్​లో మంత్రి పదవి దక్కుతుందని మొదటి నుంచి ఆమె అనుచరులు కూడా బలంగా నమ్మారు. కానీ.. కేబినెట్​ లిస్టులో పేరు కనిపించలేదు. శుక్రవారం జరిగిన వైఎస్సార్​ఎల్పీ  సమావేశానికి వచ్చిన రోజా.. మీడియాతోనూ మాట్లాడారు. జగన్ ఏ బాధ్యత అప్పగించినా సమర్థంగా నిర్వర్తిస్తానని తెలిపారు. సామాజిక వర్గాల ప్రాధాన్యతల వల్లే రోజాకు కేబినెట్​లో చోటు దక్కలేదని తెలుస్తోంది. తొమ్మిదేళ్లుగా పార్టీని అంటిపెట్టుకొని ఉన్న రోజాకు మంచి పదవే దక్కుతుందని వైఎస్సార్​సీపీ నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, భూమన కరుణాకర్​రెడ్డి వంటి వారికి కూడా కేబినెట్​లో చోటు దక్కుతుందని ప్రచారం జరిగినా.. వారికీ చోటు లభించలేదు.

Latest Updates