ఉన్నకాడికి దోచేసి సేవ్ అమరావతా?

మూడు రాజధానులకు రాష్ట్రం మొత్తం మద్దతిస్తుందన్నారు వైసీపీ ఎమ్మెల్యో రోజా. కేవలం చంద్రబాబు భజన బ్యాచ్ మాత్రమే వ్యతిరేకిస్తుందన్నారు. అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన రోజా.. చంద్రబాబు హయాంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. పాలన వికేంద్రీకరణ జరగకుండా అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా సాధ్యమన్నారు. ఎస్సీఎస్టీలకు న్యాయం చేసింది సీఎం జగన్ అన్నారు. వారి సామాజిక వర్గం కోసమే అమరావతి రాజధాని కావాలంటున్నారన్నారు. రాష్ట్రాన్ని టీడీపీ సర్వనాశనం చేసిందన్నారు. రామానాయుడు..డ్రామానాయుడయ్యారన్నారు. టీడీపీ నాయకులు సేవ్ అమరావతి అంటున్నారు.. భూములన్నీ దోచుకున్నారని..ఇంకేం సేవ్ చేయాలని ప్రశ్నించారు రోజా.

see more news

పవన్ ను అడ్డుకున్న పోలీసులు.. జనసేన ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

రోజుకొక సెల్ఫీ.. ఇరవై ఏళ్లలో 7,263 సెల్ఫీలు

Latest Updates