చిత్తూరు: నగరిలో రోజా గెలుపు

ఏపీలో వైసీపీ జోరు కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చిత్తూరు జిల్లా నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే రోజా విజయకేతనం ఎగరవేశారు. టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ పై ఆమె 2,681 ఓట్ల మెజార్టీతో ఈ విజయం సొంతం చేసుకున్నారు. ఇదే జిల్లాలోని పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా గెలుపొందారు. శ్రీకాకుళం, విజయనగరానికి చెందిన వైసీపీ ఎంపీ అభ్యర్థులూ విజయ బావుటా ఎగరవేశారు.

రాష్ట్రంలో సగానికి పైగా సీట్లలో  వైసీపీ ప్రభంజనం కొనసాగుతోంది. 150కు పైగా నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు గుర్రాలు సత్తా చాటుతున్నారు. అసెంబ్లీతో పాటు లోక్‌సభ స్థానాల్లోనూ YCP  అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.