సోషల్ డిస్టెన్సింగ్ కోసం స్పెషల్ షూస్

తయారు చేసిన రొమేనియన్ షూ మేకర్
న్యూఢిల్లీ: కరోనాతో జాగ్రత్తగా ఉండాలంటే సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరి. అందుకే బయటకు వెళ్లినప్పుడు హ్యాండ్ శానిటైజర్స్ ను తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. అయినా అలవాటు ప్రకారం తెలిసిన వాళ్లతో మాట్లాడే టైమ్ లో దగ్గరికొచ్చి మాట్లాడుతుంటారు. ఈ నేపథ్యంలో రొమేనియాకు చెందిన జార్జ్ లుప్ అనే షూ మేకర్ ఓ విషయాన్ని గమనించాడు. ప్రజలు సోషల్ డిస్టెన్సింగ్ ను సరిగ్గా పాలించట్లేదని అబ్జర్వ్ చేసిన జార్జ్.. ఓ కొత్త ఐడియాతో ముందుకొచ్చాడు. లాంగ్ నోస్డ్ లెదర్ షూస్ ను తయారీ చేయడం ప్రారంభించాడు. ఇవి యూరోపియన్ సైజ్ 75లో లభిస్తాయి. దీని గురించి పలు విశేషాలను జార్జ్ పంచుకున్నాడు.

యాక్టర్స్ కోసం తయారు చేసే షూస్ ఆధారంగా ఈ లాంగ్ నోస్డ్ షూస్ మోడల్ ను రూపొందించినట్లు జార్జ్ చెప్పాడు. ఒక్కో జత తయారు చేయడానికి రెండ్రోజులు పడుతుందన్నాడు. దీని కోసం 115 డాలర్లు ఖరీదు చేసే ఒక స్క్వేర్ మీటర్ లెదర్ అవసరమని పేర్కొన్నాడు. ‘వీధుల్లో ప్రజలు సోసల్ డిస్టెన్సింగ్ రూల్స్ ను సరిగ్గా పాటించడం లేదు. మా గార్డెన్ కోసం మార్కెట్ కు వెళ్లి మొలకలు తీసుకున్నా. ఆ టైమ్ లో మార్కెట్ ఎక్కువ మంది లేరు. కానీ ఉన్న వాళ్లే దగ్గర దగ్గరగా గుమిగూడి మాట్లాడుతున్నారు. నేను తయారు చేసిన షూస్ ను వేసుకున్న ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా నిలుచున్నా వారి మధ్య ఒకటిన్నర మీటరు డిస్టెన్స్ ఉంటుంది’ అని జార్జ్ పేర్కొన్నాడు.

Latest Updates