మద్యం సేవిస్తూ..సోషల్ డిస్టెన్స్ పాటించలేదని ఫైన్ కట్టిన ప్రధాని

కరోనా వైరస్ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే తప్పని సరిగా భౌతిక దూరం పాటించాల్సిందే. సామాన్యుల నుంచి దేశాధినేతలకు సైతం ఆ నిబంధన వర్తిస్తుంది. అలా అని ఉల్లంఘిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

రొమేనియా ప్రధాని లు డోవిక్‌ ఒర్బాన్‌ మంత్రులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ధూమపానం, మద్యపానం సేవించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే ఆ ఫోటోలపై స్పందించిన లుడోవిక్ తాను సోషల్ డిస్టెన్స్ పాటించలేదని అంగీకరిస్తూ 600డాలర్లు ఫైన్ కట్టారు. ఈ సందర్భంగా రోమేనియా ప్రధాని మాట్లాడుతూ తాను నిబంధనలను ఉల్లంఘించినట్లు అంగీకరించారు.పౌరులందరితో సంబంధం లేకుండా  ప్రధాన మంత్రి   నియమాలు పాటించాలి. చట్టాన్ని గౌరవించాలి. నేను అతీతుణ్ని కాదు. అందుకే ఫైన్ కట్టా. ఈ సంఘటన తరువాత అధికారుల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నాని పీఎం లుడోవిక్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Latest Updates