రూటు మార్చిన ఫైట్ మాస్టర్

సౌత్‌‌ సినీ ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ యాక్షన్ డైరెక్టర్స్‌‌లో పీటర్ హెయిన్స్ ఒకరు. ‘చెలి’ సినిమాతో ఫైట్ మాస్టర్‌‌‌‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన… ‘మురారితో టాలీవుడ్‌‌లో అడుగు పెట్టాడు. అపరిచితుడు, గజిని, మగధీర, రోబో, బాహుబలి వంటి ఎన్నో చిత్రాలకు అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సుల్ ని డిజైన్ చేశాడు. స్టంట్ కొరియోగ్రాఫర్ కేటగిరీలో నేషనల్ అవార్డును అందుకున్న తొలి వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు. అయితే ఇప్పుడు రూటు మారుస్తున్నాడు.

దర్శకుడు కావడం తన కల అని చాలాసార్లు చెప్పిన పీటర్, ఎట్టకేలకి ఆ కలను నిజం చేసుకుంటున్నాడు. నల్లమలుపు శ్రీనివాస్ ప్రొడక్షన్‌‌లో మెగాఫోన్ పట్టనున్నాడు. ఈ విషయమై నిర్మాత మాట్లాడుతూ.. ‘పీటర్ చెప్పిన కథ టేకాఫ్ నుం చి ప్రతిదీ ఎక్స్‌‌ట్రార్డినరీగా ఉంది. దసరాకి ప్రారంభిస్తాం. హీరో హీరోయిన్లతో పాటు ఇతర ఆర్టిస్టుల్ ని, టెక్నీషి యన్లని ఎంపిక చేసి త్వరలోనే వివరాలు వెల్లడిస్తాను’ అని చెప్పారు.

Latest Updates