ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో రాస్ టేలర్

న్యూజిలాండ్ వెటరన్ బ్యాట్స్ మెన్ రాస్ టేలర్ అరుదైన రికార్డుకు దగ్గరలో ఉన్నాడు. ఐసీసీ చరిత్రలో అన్ని ఫార్మాట్లలో 100 మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించబోతున్నాడు. ఫిబ్రవరి 21న ఇండియాతో న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్ ఆడనుంది.  ఈ టెస్టు తో రాస్ టేలర్ కు  100వ టెస్టు. దీంతో టీ20,వన్డే, టెస్టులలో 100 మ్యాచ్ లు ఆడిన మొదటి ఆటగాడిగా రాస్ టేలర్ చరిత్ర సృష్టించనున్నాడు. ఇప్పటి వరకు టేలర్ 100టీ20లు, 231 వన్డేలు, 99 టెస్టు మ్యాచ్ లు ఆడాడు.

Latest Updates