అల్వాల్ లో రౌడీ షీటర్ హత్య

హైదరాబాద్ లో రౌడీషీటర్ దారుణ హత్య జరిగింది. అల్వాల్ లోని వెంకటాపురంలో మైకేల్ అనే రౌడీ షీటర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఇవాళ(గురువారం) తెల్లవారుజామున మైకేల్‌ను హత్య చేసి కిరోసిన్ పోసి నిప్పంటించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్ దర్యాప్తు చేపట్టాయి. మైకేల్ గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్నాడు.

Latest Updates