16 ఏళ్ళ తర్వాత SR నగర్ పోలీసులకు పట్టుబడ్డ రౌడీ షీటర్ డేవిడ్ రాజు

హైదరాబాద్ కు చెందిన కరుడుగట్టిన నేరస్తుడుని అరెస్టు చేశారు పోలీసులు. 16 ఏళ్లగా తప్పించుకుని తిరుగుతున్న కరుడుగట్టిన రౌడీషీటర్ డేవిడ్ రాజు ను అరెస్టు చేసారు SR నగర్ పోలీసులు. 16 ఏళ్ళుగా డేవిడ్ రాజు పోలీసులకు దొరక్కుండా నానా ఇబ్బందులు పెడుతున్నాడు.

రౌడీషీటర్ డేవిడ్ రాజు కృష్ణా జిల్లాలో ఉన్నాడనే సమాచారంతో…అక్కడికి వెళ్లిన SR నగర్ పోలీసులు…స్థానిక పోలీసులతో కలిసి  అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ కు తరలించారు.  గతంలో ఎర్రగడ్డ లో ఒకటే రోజు జరిగిన ఏడు హత్య కేసులో డేవిడ్ రాజు ప్రధాన నిందితుడు అని పోలీసులు తెలిపారు. ఎస్సార్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లతో పాటు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఇతని పై 1991 నుంచి కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.

 

Latest Updates