రాయల్ బేబీ బాయ్ ఫస్ట్ ఫొటో : ఏం పేరు పెడతారంటే..?

లండన్ : ససెక్స్ డ్యూక్ హ్యారీ, డచెస్ మేఘన్ మార్కెల్ తమ బిడ్డను ప్రపంచానికి చూపించారు. సోమవారం మేఘన్ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ బిడ్డను చూసేందుకు బ్రిటన్ రాజవంశీయులతో పాటు.. ప్రపంచం ఆసక్తి చూపించింది. యునైటెడ్ కింగ్ డమ్… విండ్సర్ కాజిల్ లోని సెయింట్ జార్జ్ హాల్ లో తమ బిడ్డను ప్రజలకు చూపించారు ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులు. 2రోజుల వయసున్న బాబుతో జనాలకు కనిపించి… ఫొటోలకు పోజులిచ్చారు రాయల్ కపుల్.

రాయల్ కిడ్ 3.2602 KGల బరువుతో పుట్టాడని హ్యారీ, మేఘన్ ఇన్ స్టగ్రామ్ లో చెప్పారు.

రాజకుటుంబంలో వారసుడి వార్త కాబట్టి… ఇందుకు సంబంధించిన ప్రతి వార్త ఆసక్తి కలిగిస్తోంది. రాయల్ బేబీకి ఏం పేరు పెడతారన్నది ఆసక్తిగా మారింది. ట్రెడిషనల్ నేమ్స్ అయిన జేమ్స్, ఫిలిప్, ఆర్థర్ లాంటి పేర్లు పెట్టొచ్చని భావిస్తున్నారు. ఐతే.. సంప్రదాయ పేర్లను కాదని.. తమ మొదటి బిడ్డకు సరికొత్త పేరుతో సర్ ప్రైజ్ ఇవ్వాలని కూడా రాయల్ కపుల్ ఆలోచిస్తున్నారట.

కేంబ్రిడ్జి యువరాజు విలియం, యువరాణి కేట్ మిడిల్ టన్ తమ మొదటి బిడ్డకు జార్జ్ అని పేరు పెట్టుకున్నారు. రాజు అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నవారు ఇలాంటి పేరు పెట్టుకునే చాన్సెస్ ఎక్కువ అంటున్నారు బ్రిటన్ జనం. సింహాసనం కోసం ఉన్న క్యూలో ఏడో వాడు ఇప్పుడు పుట్టిన రాయల్ కిడ్. సో రాజు అయ్యే అవకాశాలు తక్కువ. అందుకే… పేరు పెట్టుకోవడంలో హ్యారీ, మేఘన్ లకు ఎక్కువ స్వేచ్ఛ ఉందని బ్రిటన్ లో చెప్పుకుంటున్నారు.

USలో ఎక్కువమంది మగబిడ్డలకు పెట్టే పేరు లియామ్. UKలో.. మగబిడ్డకు ఎక్కువమంది ఒలివర్ అనే పేరు పెడతారు. అలా.. తమ ఫ్రెండ్స్ సర్కిల్ లో పెట్టిన పేర్లను బేస్ చేసుకుని… కొత్త పేరు పెట్టాలని యువరాజు, యువరాణి ఆలోచిస్తున్నట్టు యూకేలో టాక్.

Latest Updates