సన్ రైజర్స్ పై బెంగళూరు గెలుపు

రాణించిన దేవదత్, డివిలియర్స్

బెయిర్ స్టో శ్రమ వృధా

భారీ అంచనాలతో బరిలోకి దిగిన సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ .. ఐపీఎల్‌‌‌‌-13లో రైజ్‌‌‌‌ కాలేదు..! స్టార్‌ ప్లేయర్‌ వార్నర్‌ విఫలమైనా.. బెయిర్‌ స్టో (43 బాల్స్‌ లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 61) ఉన్నంత సేపు మెరుగ్గా ఆడాడు. అయితే, లోయర్‌ ఆర్డర్‌ ని రాశపర్చడంతో.. బోణీ కొట్టలేకపోయిం ది..! మరోవైపు కొత్త కుర్రాడు దేవదత్‌‌‌‌ పడిక్కల్‌‌‌‌ (42 బాల్స్‌ లో 8 ఫోర్లతో 56), మిస్టర్‌ 360 ఏబీ డివిలియర్స్‌ (30 బాల్స్‌ లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 51) హాఫ్‌ సెంచరీలతో దుమ్మురేపడంతో.. బెంగళూరు అంచనాలను అందుకుంది..! లాస్ట్‌ ఓవర్‌ వరకు ఉత్కంఠ కొనసాగినా.. చహల్‌‌‌‌ (3/18) స్పిన్‌ దెబ్బకు ఆరెంజ్ ఆర్మీ డీలా పడిపోయింది..!!

దుబాయ్‌: చిన్న చిన్న పొరపాట్లు చేసిన సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ .. ఐపీఎల్‌‌‌‌లో పెద్ద మూల్యమే చెల్లించింది. ఓ మాదిరి టార్గెట్‌ ను కూడా ఛేదించలేక చతికిలపడింది. దీంతో సోమవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌ లో రాయల్‌‌‌‌ చాలెంజర్స్‌ బెంగళూరు 10 రన్స్‌ తేడాతో సన్‌ రైజర్స్‌ పై గెలిచింది. టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌ కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల కు163 రన్స్‌ చేసింది. ఆరోన్‌ ఫించ్‌ (27 బాల్స్‌ లో 29) ఫర్వా లేదనిపించాడు. ఛేజింగ్‌ లో 19.4 ఓవర్లు ఆడిన సన్‌ రైజర్స్‌ 153 రన్స్‌ కే ఆలౌటైంది. బెయిర్‌ స్టో కు తోడుగా మనీశ్‌ పాండే(33 బాల్స్‌ 3 ఫోర్లు, 1 సిక్సర్‌ తో 34) రాణించినా ప్రయోజనం లేకపోయింది. ఆర్‌ సీబీ బౌలర్ల సమష్టి ముందు సన్‌ బ్యాటింగ్‌ తేలిపోయింది. చహల్‌‌‌‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

అదరగొట్టిన దేవదత్‌‌‌‌..

ఐపీఎల్‌‌‌‌లో ఫస్ట్‌ మ్యాచ్‌ ఆడిన దేవదత్‌ .. తన బ్యాటింగ్‌ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఫించ్‌తో కలిసి అదిరిపోయే స్టార్టింగ్‌ ఇచ్చాడు. భువీ వేసిన ఫస్ట్‌ ఓవర్‌ లో ఓ వైడ్‌ సహా రెండు పరుగులే వచ్చినా.. సందీప్‌ వేసిన తర్వాతి ఓవర్‌ లో దేవదత్‌ రెండు ఫోర్లు కొట్టాడు. నటరాజ్‌ వేసిన నాలుగో ఓవర్‌ లో మరో మూడు బౌండరీలతో ఊపు తెచ్చాడు. అయితే ఐదో ఓవర్‌ లో నాలుగు బాల్స్‌ వేసిన మార్ష్‌ గాయంతో ఫీల్డ్‌ ను వీడటం హైదరాబాద్‌ ను దెబ్బతీసింది. ఫించ్‌ కూడా నిలకడగా ఆడడంతో పవర్‌ ప్లే ముగిసే సమయానికి ఆర్‌ సీబీ 53 రన్స్‌ చేసింది. రషీద్‌ బౌలింగ్‌ లో వరుసగా 4, 6 కొట్టాడు. పదో ఓవర్‌ లో అభిషేక్‌ వేసిన బాల్‌‌‌‌ను డీప్‌ స్క్వేర్‌ లెగ్‌ లో భారీ షాట్‌ ఆడిన దేవదత్‌ .. రషీద్‌ క్యాచ్‌ ను తప్పుగా అంచనా వేయడంతో బతికిపోయాడు. ఆ వెంటనే బౌండరీతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాతి ఓవర్‌ లోనూ దేవదత్‌ కు మళ్లీ లైఫ్‌ వచ్చింది. విజయ్‌ శంకర్‌ బౌలింగ్‌ లో దేవదత్‌ ఇచ్చిన క్యాచ్‌ ను అలెన్‌, అభిషేక్‌ నేలపాలు చేశారు. కానీ ఆ ఓవర్‌ చివరి బాల్‌‌‌‌కు దేవదత్‌ ను బౌల్డ్‌ చేసిన విజయ్‌ .. సన్‌ రైజర్స్‌ కు బ్రేక్‌ ఇచ్చాడు. 90 రన్స్‌ వద్ద తొలి వికెట్‌ కోల్పోగా వన్‌ డౌన్‌ లో వచ్చిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(14) ఫ్యాన్స్‌ ను నిరాశపరిచాడు. ఆ తర్వాతి ఓవర్‌ ఫస్ట్‌ బాల్‌‌‌‌కే ఫించ్‌ కూడా అభిషేక్‌ శర్మకు వికెట్ల ముందు దొరికిపోవడంతో ఓపెనర్లిద్దరూ డగౌట్‌ కు చేరారు. దీంతో డివిలియర్స్‌ క్రీజులోకి రాగా.. సన్‌ రైజర్స్‌ బౌలర్లు కూడా గాడిలో పడ్డారు. విరాట్‌, డివిలియర్స్‌ జోడిని సింగిల్స్‌ కే పరిమితం చేశారు. దీంతో 13వ ఓవర్‌ లో ఆర్‌ సీబీ మూడంకెల స్కోరు దాటింది. కానీ నటరాజన్‌ (16వ ఓవర్‌ ) బౌలింగ్‌ లో భారీ షాట్‌ కు ట్రై చేసిన విరాట్‌ .. డీప్‌ మిడ్‌ వికెట్‌ లో రషీద్‌ కు సింపుల్‌‌‌‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. సందీప్‌ వేసిన 19వ ఓవర్‌ లో రెండు భారీ సిక్సర్లు కొట్టిన ఏబీడీ జట్టు స్కోరును 150 దాటించాడు. అంతేకాక ఐపీఎల్‌‌‌‌లో 200 సిక్సర్ల మైలురాయిని దాటాడు. భువీ వేసిన లాస్ట్‌ ఓవర్‌ ను డివిలియర్స్‌ బౌండరీతో స్టార్ట్‌ చేసినప్పటికీ.. రెండు వికెట్లు కోల్పోయిన ఆర్‌ సీబీ.. కేవలం ఎనిమిది రన్స్‌ మాత్రమే సాధించింది. ఆ ఓవర్‌ మూడో బాల్‌‌‌‌కు డివిలియర్స్‌ .. చివరి బంతికి శివమ్‌ దూబే(7) రనౌటయ్యారు.

చెలరేగిన బెయిర్‌ స్టో

సన్‌ రైజర్స్‌ కు సెకండ్‌ ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. ఎదుర్కొన్న రెండో బాల్‌‌‌‌ను బౌండరీకి పంపి మంచి టచ్‌ లో కనిపించిన కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (6) ఊహించని విధంగా రనౌటయ్యాడు. ఉమేశ్‌ వేసిన సెకండ్‌ ఓవర్‌ లో వరుసగా 4, 6 కొట్టిన మరో ఓపెనర్‌ బెయిర్‌ స్టో.. వికెట్ల మీదుగా మరో భారీ షాట్‌ కు ట్రై చేశాడు. అయితే బాల్‌‌‌‌ ఉమేశ్‌ ను తాకుతూ నాన్‌ స్ట్రయికింగ్‌ ఎండ్‌ లో వికెట్లను తాకింది. అప్పటికి వార్నర్‌ క్రీజు బయట ఉండడంతో నిరాశగా వెనుదిరిగాడు. కానీ వన్‌ డౌన్‌ లో వచ్చిన మనీశ్‌ పాండేతో కలిసి బెయిర్‌ స్టో ధాటిగా ఆడాడు. దీంతో పవర్‌ ప్లే ముగిసేసరికి సన్‌ రైజర్స్‌ 48/1పై నిలిచింది. ఉమేశ్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌ లో బెయిర్‌ స్టో వరుసగా 6, 4 కొట్టాడు. చహల్‌‌‌‌ వేసిన తర్వా తి ఓవర్‌ లో ఆరు రన్స్‌ మాత్రమే రావడంతో సగం ఇన్నింగ్స్‌ ముగిసే సరికి హైదరాబాద్‌ జట్టు 78/1పై నిలిచింది.11వ ఓవర్‌ లో బెయిర్‌ స్టో ఇచ్చిన క్యాచ్‌ ను ఎక్స్‌ ట్రా కవర్‌ లో ఫించ్‌ మిస్‌‌‌‌ చేశాడు. కానీ నెక్స్ట్‌ ఓవర్‌ లో మనీశ్‌ (34)ను ఔట్‌ చేసిన చహల్‌‌‌‌.. ఆర్‌ సీబీకి బ్రేక్‌ ఇచ్చాడు. ప్రియమ్‌ గార్గ్‌‌‌‌ క్రీజులోకి రాగా.. 14వ ఓవర్‌లో బెయిర్‌ స్టోకు మరో లైఫ్‌ వచ్చింది. జానీ ఇచ్చిన హై క్యాచ్‌ ను స్టెయిన్‌ నేలపాలు చేయగా, వరుసగా 2, 2, 4 కొట్టిన జానీ హాఫ్‌ సెంచరీ కంప్లీట్‌ చేశాడు. తర్వాత స్టెయిన్‌ బౌలింగ్‌ లో బెయిర్‌ స్టోకు మరో లైఫ్‌ రాగా.. రెండు బౌండరీలు సహా 13 రన్స్‌ వచ్చాయి. దీంతో సన్‌ రైజర్స్‌ విజయానికి 30 బాల్స్‌ లో 43 రన్స్‌ దూరంలో నిలిచింది.

మలుపు తిప్పిన చహల్‌‌‌

కానీ 16వ ఓవర్‌ లో వరుస బంతుల్లో బెయిర్‌ స్టో, విజయ్‌ శంకర్‌ (0)ను బౌల్డ్‌ చేసిన చహల్‌‌‌‌ మ్యాచ్‌ ను టర్న్‌‌‌‌ చేయడంతోపాటు ఆర్‌ సీబీని తిరిగి మ్యాచ్‌ లో కి తెచ్చాడు. ఆ ఓవర్‌ లో అభిషేక్‌ ఓ బౌండరీ కొట్టగా చివరి నాలుగు ఓవర్లలో సన్‌ రైజర్స్‌ కు 37 రన్స్‌ అవసరమయ్యాయి. అనంతరం దూబే బౌలింగ్‌ లో ప్రియమ్‌ బౌల్డ్‌ అవ్వగా.. ఓవర్‌ లాస్ట్‌ బాల్‌‌‌‌కు రెండో రన్‌ కు ట్రై చేసి అభిషేక్ రనౌటయ్యాడు. ఈ క్రమంలో రషీద్‌ ను ఢీకొనడంతో అతను గాయపడ్డాడు. కానీ సైనీ తర్వా తి ఓవర్‌ లో భువీ(0), రషీద్‌ (6)ను ఔట్‌ చేయగా, 19వ ఓవర్‌ లో నాలుగు రన్స్‌ ఇచ్చిన దూబే.. మార్ష్‌ (0)ను ఔట్‌ చేశాడు. దీంతో సన్‌ రైజర్స్‌ విక్టరీ కి చివరి ఆరు బాల్స్‌ లో 18 రన్స్‌ చేయాల్సి వచ్చింది. కానీ సందీప్‌ (9)ను ఔట్‌ చేసి స్టెయిన్‌ మ్యాచ్‌ ను ముగించాడు.

స్కోరు బోర్డు

బెంగళూరు: దేవదత్‌ ( బి) విజయ్‌ 56, ఫించ్‌ (ఎల్బీ ) అభిషే క్‌ 29, కోహ్లీ (సి) రషీద్‌ (బి) నట- రాజన్‌ 14, డివిలియర్స్‌ (రనౌట్‌ ) 51, దూబే (రనౌట్‌ ) 7, ఫిలిప్‌ (నాటౌట్‌ ) 7 ;

ఎక్స్ ట్రాలు: 5 ; మొత్తం : 20 ఓవర్లలో 163/5 ; వికెట్ల పతనం: 1–90, 2–90, 3–123, 4–162, 5–163 ;

బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–25–0, సందీప్‌ 4–0–36–0, నటరాజన్‌ 4–0–34–1, మార్ష్‌ 0.4–0–6–0, విజయ్‌ 1.2–0–141, రషీద్‌ 4–0–31–0, అభిషే క్‌ 2–0–16–1.

సన్‌ రైజర్స్‌ : వార్నర్‌ (రనౌట్‌ ) 6. బెయిర్‌ స్టో (బి) చహల్‌‌‌‌ 61, మనీశ్‌ (సి) సైనీ (బి) చహల్‌‌‌‌ 34, ప్రియమ్‌ (బి) దూబే 12, విజయ్‌ (బి) చహల్‌‌‌‌ 0, అభిషేక్‌ (రనౌట్‌ ) 7, రషీద్‌ (సైనీ) 6, భువనేశ్వర్​ (బి) సైనీ 0, సందీ ప్‌ (సి) కోహ్లీ (బి) స్టెయిన్‌ 9, మార్ష్‌ (సి) కోహ్లీ(బి) దూబే 0, నటరాజన్‌ (నాటౌట్‌ ) 3 ;

ఎక్స్‌ట్రాలు: 15 ; మొత్తం : 19.4 ఓవర్లలో 153 ఆలౌట్‌ ; వికెట్ల పతనం: 1–18, 2–89, 3–121, 4–121, 5–129, 6–135, 7–141, 8–142, 9– 143, 10–153 ; బౌలింగ్‌ : స్టెయిన్‌ 3.4–0–33–1, ఉమేశ్‌ 4-0–48–0, సైనీ 4–0– 25–2, సుందర్‌ 1–0–7–0, చహల్‌‌‌‌ 4–0–18–3, దూబే 3–0–15–2.

Latest Updates