వెనక్కి రప్పించిన 7వేల రాయల్ బైకులు

రాయల్ ఎన్‌ఫీల్డ్ 7,000 బైకుల్ని వెనక్కి పిలిపించింది. బ్రేక్ క్యాలిపర్ బోల్డ్‌లో సమస్యల్ని గుర్తించిన కంపెనీ… 7,000 బుల్లెట్, బుల్లెట్ ఎక్ట్రా మోడల్స్‌ని వెనక్కి తెప్పించింది. 2019 మార్చి 20 నుంచి 2019 ఏప్రిల్ 30 మధ్య తయారు చేసిన బైకుల్లో ఈ సమస్యల్ని గుర్తించింది కంపెనీ. సర్వీస్ ఇన్వెస్టిగేషన్స్‌లో సమస్యలు బయటపడ్డాయని, బ్రేక్ కాలిపర్ బోల్ట్స్‌లో లోపాలను గుర్తించామని, రాయల్ ఎన్‌ఫీల్డ్ నాణ్యతా ప్రమాణాలకు తగ్గట్టుగా ఇవి లేవని రాయల్ ఎన్‌ఫీల్డ్ ఓ ప్రకటన జారీ చేసింది.

బైక్ బ్రేకింగ్ సిస్టమ్‌లో బ్రేక్ కాలిపర్ బోల్డ్ చాలా ముఖ్యమైనది. బ్రేకింగ్ సిస్టమ్‌లోనే సమస్యలు ఉండటంతో వెంటనే సర్వీస్ కోసం 7,000 మోటార్ సైకిళ్లను వెనక్కి రప్పిస్తోంది. వెంటనే సర్వీసింగ్‌కు రావాలని కస్టమర్లకు సమాచారం అందిస్తోంది కంపెనీ. వాహనాల్లో లోపాలు బయటపడటం, కొన్ని యూనిట్స్ అమ్మిన తర్వాత వాటిని గుర్తించడం, రిపేర్ల కోసం వెనక్కి రప్పించడం ఆటోమొబైల్ కంపెనీలకు కొత్తేం కాదు. అయితే మోటార్ సైకిల్ రంగాన్ని ఏలుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంటి కంపెనీలో ఇలాంటి లోపాలు బయటపడటం ఆ బైక్ లవర్స్‌‍ని ఆందోళనకు గురిచేస్తుంది.

 

Latest Updates