రేసులో రాజవంశీయులు

ఎడారి రాష్ట్రం రాజస్థాన్ లో లోక్ సభ ఎన్నికల్లో ముగ్గురు రాజవంశీకులు ప్రజాకోర్టులో తమ భవిష్యత్తును తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 29, మే 6న రెండు విడతల్లో జరగనున్న ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ధోల్ పూర్ రాజ కుటుంబానికి చెందిన దుష్యంత్ సింగ్ ఝాలావర్బరన్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. ఇంతకు ముందు మూడుసార్లు ఆయనఈ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ధోల్పూర్ మహారాణి, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె కుమారుడు దుష్యంత్ సింగ్. 2004 నుంచి వసుంధర రాజె వారసుడి గాఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాలుగోసారి అదృష్టాన్ని పరీక్షించుకోడానికి బరిలోకి దిగారు. దుష్యంత్ సింగ్ పై కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ శర్మ పోటీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ సింధియా రాజ కుటుంబానికి చెందిన వసుంధర రాజె ధోల్ పూర్ రాజ కుటుంబానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.1989నుంచి 2004 వరకు ఝాలావర్ బరాన్ లోక్సభ స్థానానికి ఆమె ప్రాతినిధ్యం వహించారు. తన కుమారుడు దుష్యంత్ కోసం ఈ స్థానాన్ని ఆమె వదులుకున్నారు.

తొలిసారి రాజ్ సమంద్ నుంచి దియా కుమారి
జైపూర్ రాజ కుటుంబానికి చెందిన దియాకుమారి కూడా లోక్ సభ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈమె1962 లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ టికెట్ పై గెలిచిన, రాజకుటుంబానికి చెందిన తొలిమహిళా సభ్యురాలు, 80శాతం ఓట్లు సాధించి గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించుకున్న గాయత్రి దేవిముని మనవరాలు దియా కుమారి. జైపూర్ చివరి రాజు సవాయ్ భవానీసింగ్ కూతురైన దియా కుమారి సవాయ్ మాధోపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా తొలిసారి రాజ్సమంద్ లోక్ సభ స్థానం నుంచి ఆమె పోటీచేస్తున్నారు. తనది రాజకుటుంబమని ఆమెప్రచారంలో చెప్పుకోవడం లేదు. పాకిస్థాన్ సరిహద్దులో శత్రువులపై పోరాడినందుకు తనతండ్రికి మహా వీర్ చక్ర అవార్డు వచ్చిందని, తాను ఆ సైనికుడి కూతుర్ని అని ఆమె ఎన్నికల ప్రచారంలో చెప్పుకుంటున్నారు. పాకిస్థాన్ లోని బాలాకోట్ లో టెర్రర్ క్యాంపులపై ఎయిర్ ఫోర్స్ దాడుల గురించి ప్రస్తావిస్తూ.. ఈ ఎన్నికల్లో నేషనలిజం, దేశ భక్తి రెండు కీలకమైన అంశాలనిఆమె చెబుతున్నారు. దియా కుమారిపై కాంగ్రెస్ అభ్యర్థి దేవికానందన్ గుర్జార్ పోటీ చేస్తున్నారు. దియా కుమారి రాజ కుటుంబానికి చెందినవారని, ఆమె మహారాణి అని, ఆమె గెలిస్తే తిరిగి ప్రజల్లోకి రారని గుర్జార్ ప్రచారం చేస్తున్నారు. తానురైతు బిడ్డనని, తనను గెలిపిస్తే ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇస్తున్నారు.

ఆల్వార్ నుంచి జితేంద్ర సింగ్
ఆల్వార్ లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రిజితేంద్ర సింగ్ బరిలో ఉన్నారు. ఆల్వార్రాజ కుటుంబానికి చెందిన జితేంద్రసింగ్ 2009 ఎన్నికల్లో ఈ స్థానంనుంచి గెలిచారు. ఆయన తల్లి 1991నుంచి 1996 వరకు అల్వార్ బీజేపీఎంపీగా ఉన్నారు.రాజవంశానికి చెందిన జితేంద్రసింగ్ ను స్థానికులు గౌరవంగా ‘భన్వర్’ అని పిలుస్తారు.తమ కుటుంబం తరతరాలుగా ఇక్కడే ఉంటోందని, ప్రజలకోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటామని జితేంద్రసింగ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. జితేంద్ర సింగ్ పైబీజేపీ అభ్యర్థిగా దివంగత నేత మహంత్చంద్ నాథ్ శిష్యుడు మహంత్ బలాక్నాథ్ పోటీలో ఉన్నారు.

Latest Updates