క్యాబ్ డ్రైవర్‌ను రేప్ చేసిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్

ఒక వ్యక్తిని మరో వ్యక్తి రేప్ చేసిన ఘటన ముంబైలో జరిగింది. రెడ్ లైట్ ప్రాంతానికి తీసుకెళ్లడానికి నిరాకరించాడని ఓ క్యాబ్ డ్రైవర్‌పై, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అత్యాచారం చేశాడు. సోమవారం సాయంత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ సమీపంలోని పీడి మెల్లో ప్రాంతంలో క్యాబ్ డ్రైవర్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. అక్కడికి వచ్చిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అమిత్ ధంకడ్.. తనను రెడ్ లైట్ ఏరియాలోని ఏదైనా వ్యభిచార గృహానికి తీసుకువెళ్లాలని అడిగాడు. అందుకు క్యాబ్ డ్రైవర్ ఒప్పుకోలేదు. దాంతో ఆగ్రహానికి లోనైన కానిస్టేబుల్.. సదరు క్యాబ్ డ్రైవర్‌ను చితక్కొట్టి.. రైల్వే స్టేషన్ సమీపంలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అతని దగ్గర ఉన్నడబ్బు, ట్యాక్సీ కీస్, ఇతర వస్తువులను తీసుకెళ్లాడు. క్యాబ్ డ్రైవర్ ఫిర్యాదుతో..పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అతన్ని ఆస్పత్రికి తరలించారు. అమిత్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఆర్పిఎఫ్ అధికారులు.. అమిత్ ధంకడ్‌ను విధుల నుండి తొలగించారు.

Latest Updates