మహిళ ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ జవాన్

కదులుతున్న రైలు ఎక్కబోయి ట్రాక్ పై పడపోబోయిన మహిళను కాపాడాడు ఓ ఆర్పీఎఫ్ జవాన్. ఈ ఘటన అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ లో గురువారం రాత్రి జరిగింది. రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాం నుంచి కదులుతున్న రైలు ఎక్కబోయిన ఓ మహిళ అదుపుతప్పి అదే రైలు కిందకు పడబోతుండగా అక్కడే ఉన్న భద్రత సిబ్బంది ఆమెను చాకచక్యంగా బయటకు లాగి ప్రాణాలు కాపాడాడు. ప్రయాణికులు చూస్తుండగానే ఈ సంఘటన జరిగింది. ఆమె ప్రాణాలు కాపాడినందుకు అక్కడున్న ప్రయాణికులు జవాన్ ను అభినందించారు. అతని ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు.

Latest Updates