ట్రైన్ కిందపడబోతున్న యువతి..మెరుపు వేగంతో

రైల్వే ప్రమాదం నుంచి ఓ యువతి తృటిలో తప్పించుకుంది. ప్రాణాలకు తెగించిన రైల్వే కానిస్టేబుల్ ఆ యువతి ప్రాణాలు కాపాడడంతో  ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఒడిశాలో భువనేశ్వర్ రైల్వే స్టేషన్ లో రన్నింగ్ లో ఉన్న ట్రైన్ ను ఎక్కేందుకు ఓ యువతి ప్రయత్నించింది. రన్నింగ్ లో ట్రైన్ ఎక్కింది కానీ డోర్ వద్ద ప్రయాణికులు కిక్కిరిసి ఉండడంతో లోపలికి వెళ్లలేకపోయింది. పట్టుతప్పి నడుస్తున్న రైలుకు ఫ్లాట్ మధ్యలో పడబోతుంది. అదే సమయంలో ఓ రైల్వే కానిస్టేబుల్ యువతి ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి మెరుపువేగంతో ట్రైన్ నుంచి కిందపడబోతున్న యువతిని ఫ్లాట్ ఫాంపైకి లాగాడు. దీంతో యువతి ప్రాణాలు దక్కించుకుంది.

Latest Updates