యూట్యూబ్‌‌లో ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డు

హైదరాబాద్: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్‌‌ మూవీపై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా అప్‌‌డేట్స్‌‌పై ఫ్యాన్స్‌లో ఉత్సుకత ఏర్పడింది. అందుకు తగ్గట్లే ఒక్కో పాత్రకు సంబంధించిన లుక్స్, టీజర్స్‌‌ను విడుదల చేస్తున్నాడు జక్కన్న. గత నెల 22న మూవీలో ఎన్టీఆర్ పాత్ర టీజర్‌‌ను రామరాజు ఫర్ భీమ్ పేరుతో రిలీజ్ చేశాడు. దీనికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ టీజర్‌కు యూట్యూబ్‌‌లో 32 మిలియన్స్ వ్యూస్ రాగా, 1.1 మిలియన్ల లైక్స్ వచ్చాయి. అలాగే 2 లక్షల కామెంట్స్ వచ్చాయి. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ సినిమా టీజర్‌‌కు ఇంత మొత్తంలో కామెంట్లు రావడం ఇదే ప్రథమం. ఆ విధంగా ఆర్ఆర్ఆర్ కొత్త రికార్డును స‌ృష్టించింది. ఈ మూవీలో అలియా భట్, రే స్టీవెన్‌‌సన్, అలీసన్ డూడీ, సముద్రఖని, అజయ్ దేవగణ్, శ్రియా శరణ్ కూడా నటిస్తున్నారు.

Latest Updates