ఆర్ ఆర్ ఆర్ కి కూడా బాహుబలి స్ట్రాటజీని ఫాలోఅవుతున్న జక్కన్న

దర్శక ధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఆర్ ఆర్ ఆర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది.ప్రస్తుతం రాజమౌళి లండన్ లో రాయల్ అల్బర్ట్ హాల్ లో బాహుబలి సినిమా లైవ్ కాన్సర్ట్ ప్రదర్శనలో  బిజీగా ఉన్నారు. లైవ్ కాన్సర్ట్ కోసం రాజమౌళి పంచకట్టు ధరించడం స్పెషల్ అట్రక్షాన్ గా నిలిచింది.

తాజాగా ఈ ఆర్ ఆర్ ఆర్ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్ సినిమా స్టోరీ ఎలా ఉంటుందో ఇప్పటికే రాజమౌళి ఓ హింట్ ఇచ్చారు. తెలంగాణ నుంచి కొమురం భీం, ఆంధ్రా నుంచి సీతారామరాజు ఇద్దరు రెండు సంవత్సరాల పాటు మిస్సవుతారు. ఎటువెళ్లారో తెలియదు, ఎక్కుడున్నారో తెలియదు. రెండు సంవత్సరాల తరువాత స్వాత్రంత్యం కోసం బ్రిటీష్ వారిపై సీతారామరాజు, నిజాం నవాబులపై కొమరం భీం పోరాటం మొదలు పెట్టారు. ఆ రెండు సంవత్సరాల గ్యాప్ లో వాళ్లిద్దరు కలుసుకుంటే , వాళ్లకు ఎదురైన అనుభవాలు ఏమై ఉంటాయి అనే మెయిన్ థీం తో  సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు.  

అయితే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్  సినిమా స్టోరీ ఏంటీ, యుద్ధ సన్నివేశాలు, షూటింగ్ లొకేషన్లు, సాంగ్స్, పైట్స్  సన్నివేశాలు లీక్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాకి గేయ రచయిత సుద్దాల అశోక్ తేజతో మూడు పాటలు రాయించుకుంటున్నాడు. బాహుబలికి రాజమౌళి ఏం  స్ట్రాటజీని అప్లయ్ చేశాడో ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు. బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో నటీనటులు స్టోరీని, చిత్ర విశేషాలు,షూటింగ్ స్పాట్స్ గురించి ఎక్కడా డిస్కస్ చేయకూడదని చెప్పాడు రాజమౌళి. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ కి  పాటలు రాస్తున్న అశోక్ కి కొన్ని కండీషన్స్ పెట్టాడట దర్శక ధీరుడు.    అందుకే ఈ సినిమా గురించి, సాంగ్స్ గురించి తన భార్యతో కూడా చెప్పకూడదని నిబంధనలు విధించాడట జక్కన్న. ఇదే విషయాన్ని అశోక్ తేజ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ డైరక్టర్ గా రాజమౌళి డెడికేషన్ అద్భుతమని ప్రశంసల వర్షం కురిపించారు.

Latest Updates