RRR అర్ధం చెప్పిన రాజమౌళి

యంగ్ టైటర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ తో కలిసి సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్నచిత్రం. ఈ మూవీ టైటిల్ లోగో,మోషన్ పోస్టర్ ను ట్విట్టర్లో రిలీజ్ చేసింది మూవీ టీం. RRR (రౌద్రం,రణం,రుధిరం ) అని టైటిల్ ను ఫిక్స్ చేశారు.  ఇవాళ ఉగాది సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే మోషన్ పోస్టర్ పవర్ ఫుల్ గా ఉంది. నీళ్లతో ఎన్టీఆర్, నిప్పుతో రాంచరణ్ కనిపించారు. రెండు భిన్నతత్వాలు కల్గి ఉన్నవారు కలిస్తే ఒక కొత్త శక్తి వస్తుందనే అర్థంలో ఈ పోస్టర్ ఉంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీంగా,రాంచరణ్ అల్లూరి సీతారామ రాజుగా కనిపించనున్నారు. వీరికి జోడిగా అలియాభట్,హాలీవుడ్ హీరోయిన్ ఓలివియా నటిస్తున్నారు.మరో కీలక పాత్రలో అజయ్ దేవ్ గణ్ నటిస్తున్నారు. ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

Latest Updates