RS బ్రదర్స్ లో భారీ అగ్నిప్రమాదం

rs-brothers-fireహైదరాబాద్ అబిడ్స్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అబిడ్స్ లోని RS బ్రదర్స్ బట్టల షాప్ లో అర్థరాత్రి(శుక్రవారం) ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. నాలుగు ఫ్లోర్ల వరకు మంటలు వ్యాపించడంతో షాపులోని బట్టలన్నీ పూర్తిగా కాలిపోయాయి. ఫైర్ సిబ్బంది దాదాపు మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో కోట్ల రూపయాల్లో ఆస్తినష్టం జరిగి ఉందంటుని పోలీసులు అంచనా వేస్తున్నారు. అబిడ్స్ లో అగ్నిప్రమాదంతో.. చుట్టుపక్కల షాపులు, ప్రాంతాలవాళ్లు భయంతో వణికిపోయారు. మంటలు అదుపులోకి రావడంతో ఊపిరిపీల్చుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates