1.41లక్షల కోట్ల నష్టంతో స్టాక్ మార్కెట్.. పెరుగుతున్న కరోనా కేసులే కారణమా?

స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 580 పాయింట్లు నష్టపోయి 43,600, నిఫ్టీ 167 పాయింట్లు పడిపోయి 12,772 పాయింట్ల వద్ద ముగిసింది. దీంతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌తో పాటు ఐటీ సెక్టార్ దెబ్బతీసినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లు భారీ నష్టాల్లో ముగియడంతో ఈ రోజు ఇన్వెస్టర్ల సంపద లక్ష కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.  ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో..ఆ ప్రభావం మార్కెట్ పైన పడింది. దీనికి ఫైనాన్షియల్ స్టాక్స్ భారీ నష్టం తోడవడంతో సూచీలు పడిపోయాయి. దీంతో ఇన్వెస్టర్లు రూ.1.41 లక్షల కోట్ల వరకు నష్టపోయారు.

Latest Updates