రూ. లక్ష వరకు రుణమాఫీ.. తొలి బడ్జెట్లో 6 వేల కోట్లు

kcr-produced-telangana-budget-2019-2020

kcr-produced-telangana-budget-2019-2020హైదరాబాద్: రైతుల పరిస్థితి మెరుగుపడే వరకు తమ ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ చెప్పారు. అసెంబ్లీలో శుక్రవారం ఆయన బడ్జెట్ ప్రవేశ పెట్టారు. శాసన సభ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణ మాఫీ చేస్తామని చెప్పారు. 2018 డిసెంబరు 11 నాటికి రూ. లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఇందులో భాగంగా తొలి బడ్జెట్ లో రూ.6 వేల కోట్లు కేటాయిస్తున్నామన్నారు.

ఇంకా రైతు బంధును ఎకరానికి రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. దీని కోసం బడ్జెట్ లో రూ.12 వేల కోట్లు కేటాయించారు. అలాగే రైతు బీమాకు రూ.650 కోట్ల నిధులను ఇస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు.

Latest Updates